శ్రీనగర్‌కు క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేయని విమానయాన సంస్థలు!

Best Web Hosting Provider In India 2024


శ్రీనగర్‌కు క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేయని విమానయాన సంస్థలు!

Anand Sai HT Telugu

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొందరు అక్కడకు వెళ్లడానికి భయపడుతున్నారు. దీంతో శ్రీనగర్‌కు టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే క్యాన్సలేషన్ ఛార్జీలను విమానయాన సంస్థలు వసూలు చేయడం లేదు.

ప్రతీకాత్మక చిత్రం

హల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్‌కు ప్రయాణించే తమ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఓ విషయాన్ని ప్రకటించింది. ఎయిర్ ఆసియా కూడా ఏప్రిల్ 30, 2025 వరకు శ్రీనగర్‌కు వెళ్లే విమానాలకు రద్దు ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు తెలిపింది.

బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు

ఏప్రిల్ 30, 2025 వరకు శ్రీనగర్ నుండి లేదా శ్రీనగర్‌కు విమానాలు బుక్ చేసుకున్న ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రుసుము తిరిగి చెల్లించే సౌకర్యాన్ని ఎయిర్ ఇండియా అందించింది. ప్రయాణికులు కోరుకుంటే వారి బుకింగ్‌ను రద్దు చేసుకోవచ్చని, పూర్తి వాపసు పొందవచ్చని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది.

కస్టమర్‌లు తమ బుకింగ్‌లను సులభంగా నిర్వహించడానికి www.airindiaexpress.com/manage-booking ని సందర్శించవచ్చని లేదా #SrinagarSupport అని టైప్ చేయడం ద్వారా AI-ఆధారిత చాట్ అసిస్టెంట్ టియా నుండి సహాయం పొందవచ్చని కంపెనీ తెలియజేసింది.

శ్రీనగర్‌కు ఎయిరిండియా కనెక్టివిటీ

ఎయిర్ ఇండియా శ్రీనగర్‌ను నేరుగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, జమ్మూ, కోల్‌కతాకు కలుపుతుంది. వారానికి 80 విమానాలను నడుపుతుంది. దీనితో పాటు తన దేశీయ నెట్‌వర్క్ కింద అగర్తల, అయోధ్య, చెన్నై, గోవా, కొచ్చి, ముంబై, పాట్నా, తిరువనంతపురం, వారణాసితో సహా 26 గమ్యస్థానాలకు వన్ స్టాప్ కనెక్టివిటీని కూడా అందిస్తుంది.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 23న శ్రీనగర్ నుండి ఢిల్లీ, ముంబైకి రెండు అదనపు విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా బుధవారం తెలిపింది. శ్రీనగర్‌కు బయలుదేరే అన్ని ఇతర విమానాలు వాటి షెడ్యూల్ ప్రకారం నడుస్తూనే ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఎయిర్ ఇండియా తన కాంటాక్ట్ సెంటర్ నంబర్లు 011 69329333 మరియు 011 69329999 లను సంప్రదించాలని సూచించింది.

ఇండిగో కూడా ప్రత్యేక విమానాలు

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన విషాద సంఘటనపై అకాసా ఎయిర్‌లైన్స్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. శ్రీనగర్‌లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విమానాల రీషెడ్యూల్, రద్దుపై డిస్కౌంట్‌ను పెంచామని ఇండిగో.. ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. దీనితో పాటు ఏప్రిల్ 23న రెండు ప్రత్యేక విమానాలను కూడా నడుపుతుంది. మరిన్ని వివరాలకు goindigo.in ని సందర్శించొచ్చు. లేదంటే ఈ నెంబర్లకు +91 124 4973838 – +91 124 6173838 కాల్ చేయవచ్చు.

Anand Sai

eMail
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link