





Best Web Hosting Provider In India 2024

తెలంగాణలో 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు.. నిప్పుల కొలిమిలా వాతావరణం, మరో రెండ్రోజులు వడగాల్పులు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో తేమ పెరగడంతో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. నిజామాబాద్‌లో 44.5డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీలు, మెదక్‌లో 43.4డిగ్రీలు, రామగుండంలో 42.8డిగ్రీలు,హన్మకొండలో 41డిగ్రీలు, ఖమ్మంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలో భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. మరో రెండు రోజుల పాటు వడగాల్పులు ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
గురువారం నుంచి రెండు రోజుల పాటు పగలు వడగాల్పులు, రాత్రివేళల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి వాతావరణం నమోదవుతుం దని ఐఎండి అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదైంది. సాధారణం కన్నా 3.6 డిగ్రీలు ఎక్కువ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 44.3, మెదక్లో 43. 4, రామగుండంలో 42.8, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్ర తలు నమోదయ్యాయి.
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో చాలా ప్రాంతాలు భరించలేని వేడి ఉంటోంది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గత వారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి.
తెలంగాణలో గత నాలుగైదు ఐదు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన పెరుగుదల నమోదవుతోంది. ప్రస్తుతం పలు ప్రాం తాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరాయి.
గాలిలో తేమ శాతం పెరగటంతో ఉక్క పోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం నిజామాబాద్ లో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్ర తలు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నిజామాబాద్ లో 3.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, ఆదిలాబాద్ లో 3.4డిగ్రీలు , ఖమ్మంలో 3.1 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.
వడగాలులకు ఏడుగురి మృతి
తెలంగాణలో బుధవారం వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఆష్టా గ్రామా నికి చెందిన గంగారాం (55), కరీంనగర్ జిల్లా రామ డుగు మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన కళ్లెం రమేశ్ (54), ఖమ్మం జిల్లా మదిర పట్టణం రామనాథం వీధికి చెందిన శేషాచారి (80), పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పుల్లూరి రమేష్ కుమార్ (37), వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన రవళి (35), హైదరాబాద్ చందానగర్ ఠాణా పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ ఆరో ప్లాట్‌ఫాంపై ఓ యాచకుడు (70), కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక కాశీరాం (42) మరణించారు.
సంబంధిత కథనం
టాపిక్