ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 262 కోట్ల బ్లాక్ బస్టర్.. 4 భాషల్లో స్ట్రీమింగ్.. అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 262 కోట్ల బ్లాక్ బస్టర్.. 4 భాషల్లో స్ట్రీమింగ్.. అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ మలయాళంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎల్2 ఎంపురాన్ స్ట్రీమింగ్‌కు చ్చేసింది. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ నాలుగు భాషల్లో అయింది. ఎల్2 ఎంపురాన్ ఓటీటీ వివరాలు చూస్తే!

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 262 కోట్ల బ్లాక్ బస్టర్.. 4 భాషల్లో స్ట్రీమింగ్.. అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్!

ఇటీవల కాలంలో మలయాళ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా గత నెలలో కూడా విడుదలై మలయాళ ఇండస్ట్రీలోని పలు బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన సినిమా ఎల్2 ఎంపురాన్. 2019లో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్ మూవీకి ఎల్2 ఎంపురాన్ సీక్వెల్‌గా తెరకెక్కింది.

హీరో దర్శకత్వం

ఎంపురాన్ అంటే దేవుడికి తక్కువ.. చక్రవర్తికి ఎక్కువ అనే మీనింగ్ వస్తుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు మరో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఎల్2 ఎంపురాన్ మూవీ తెరకెక్కింది. డ్రగ్స్, ఇంటర్నేషనల్ మాఫియా, ఫ్యామిలీ ఎమోషన్స్, రాజకీయాలు వంటి ఇతర అంశాల చుట్టూ ఈ సినిమాను చిత్రీకరించారు.

2019లో లూసిఫర్ సూపర్ హిట్ కావడంతో మూవీ సీక్వెల్‌పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. దానికి తగినట్లుగానే ఎల్2 ఎంపురాన్ అనౌన్స్‌మెంట్ చేయగానే విపరీతమైన హైప్ వచ్చింది. ఈ క్రమంలోనే మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎల్2 ఎంపురాన్ థియేటర్లలో విడుదల అయింది.

ఎల్2 ఎంపురాన్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్

మలయాళంలో ఎల్2 ఎంపురాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సుమారు రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఎల్2 ఎంపురాన్ వరల్డ్ వైడ్‌గా రూ. 262.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలో రూ. 121.7 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 142 కోట్ల గ్సాస్ కలెక్ట్ చేసింది. దీంతో మలయాళంలోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఎల్2 ఎంపురాన్ రికార్డ్ కొట్టింది.

అయితే, మలయాళంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎల్2 ఎంపురాన్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్లాఫ్‌గా నిలిచింది. ఎల్ ఎంపురాన్ సినిమాకు చాలా వరకు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. మూవీ అంతా చాలా స్లోగా సాగినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇవాళ (ఏప్రిల్ 24) ఎల్2 ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సుమారు నెల రోజుల గ్యాప్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టింది మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్.

ఎల్2 ఎంపురాన్ ఓటీటీ

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఎల్2 ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో ఎల్2 ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఎల్2 ఎంపురాన్ కథ విషయానికొస్తే.. ఐయూఎఫ్ పార్టీలో సమస్యలన్ని సద్దుమణుగిపించిన స్టీఫెన్ నెడుంపల్లి (మోహన్ లాల్) అజ్ఞాతంలోకి వెళ్తాడు.

పార్టీ పగ్గాలు, అధికారం చేతికొచ్చిన తర్వాత జతిన్ రామ్‌దాస్ (టొవినో థామస్) భారీగా అవినీతి చేస్తాడు. తన సోదరుడు చేస్తున్న అవినీతిని ఎదిరించడానికి స్టీఫెన్ రంగంలోకి దిగుతాడు. దాంతో అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్ మొదలు అవుతుంది. అది ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్తుంది.

ఎల్2 ఎంపురాన్ అంశాలు

కాగా, లూసిఫర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కితే ఎల్2 ఎంపురాన్ రాజకీయ అంశాలతోపాటు ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాను టచ్ చేసి తెరకెక్కించారు. అలాగే, ఫ్యామిలీ ఎమోషన్స్, రాజకీయ వ్యూహాలు, టెర్రరిజం వంటి ఇతర అంశాలను ఎల్2 ఎంపురాన్ సినిమాలో యాడ్ చేశారు. రూ. 262 కోట్లు కొల్లగొట్టిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎల్2 ఎంపురాన్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024