గుండె నిండా గుడి గంట‌లు ఈ రోజు ఎపిసోడ్: గ‌ర్వంతో పొంగిపోయిన మీనా – కోడ‌లి చేతిలో ప్ర‌భావ‌తి ఓట‌మి – సంజుతో బాలు గొడ‌వ‌

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంట‌లు ఈ రోజు ఎపిసోడ్: గ‌ర్వంతో పొంగిపోయిన మీనా – కోడ‌లి చేతిలో ప్ర‌భావ‌తి ఓట‌మి – సంజుతో బాలు గొడ‌వ‌

Nelki Naresh HT Telugu

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 24 ఎపిసోడ్‌లో త‌ల‌కు బ్యాండేజ్‌తో మౌనిక క‌నిపించ‌డంతో బాలు కంగారు ప‌డ‌తాడు. సంజు వ‌ల్లే ఈ గాయ‌మైందా చెప్ప‌మ‌ని మౌనిక‌ను అడుగుతాడు. సంజును న‌రికేస్తాన‌ని అత‌డి కాల‌ర్ ప‌ట్టుకొని గొడ‌వ‌ప‌డ‌తాడు.

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 24 ఎపిసోడ్‌

మీనా నుంచి తీసుకున్న పుస్తెల తాడును ఆమెకు ఇచ్చేయ‌మ‌ని ప్ర‌భావ‌తితో చెబుతాడు స‌త్యం. మీనా మెడ‌లో ప‌సుపుకొమ్ము చూసి…ప్ర‌తి ఒక్క‌రూ నువ్వే పుస్తెల‌తాడు లాక్కున్నావ‌ని అనుకుంటార‌ని అంటాడు. మీనా మెడ‌లో నుంచి చైన్ దొంగ‌లా లాగేసుకున్న‌ట్లు మాట్లాడుతున్నారేంటి అని భ‌ర్త‌నే ద‌బాయిస్తుంది ప్ర‌భావ‌తి. మీనానే బంగారం మొత్తం తీసుకొచ్చి నా మొహాన కొట్టింద‌ని త‌న త‌ప్పును స‌మ‌ర్థించుకుంటుంది.

రోహిణి గౌర‌వంగా పార్ల‌ర్ పెట్టుకుంది. శృతి సినిమా వాళ్ల‌కు డ‌బ్బింగ్ చెబుతుంది. వాళ్లు ఎప్పుడైనా మీనాలా ప్ర‌వ‌ర్తించారా? పుట్టింటిలో తిండికి గ‌తిలేనివాళ్లు అత్తింట్లో ద‌ర్జాలు వెల‌గ‌బెడ‌తారు అంటూ అవ‌మానిస్తుంది మాట్లాడుతుంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడ‌కు అని భార్య‌పై స‌త్యం ఫైర్ అవుతాడు.

బంగారం అక్క‌ర‌లేదు…

మీనాను తిట్ట‌బోతూ ఆమె క‌నిపించ‌డంతో ఆగిపోతుంది ప్ర‌భావ‌తి. త‌న‌కు ఏ బంగారం అక్క‌ర‌లేద‌ని, బాలు ఎప్పుడు కొనిస్తే అప్పుడే వేసుకుంటాన‌ని మీనా అంటుంది. అయినా మేము పూలు అమ్ముకునేవాళ్ల‌మే…అత్త‌య్య భాష‌లో తిన‌డానికి గ‌తిలేనివాళ్లం. కానీ ఎవ‌రి ద‌గ్గ‌ర చేయిచాయ‌లేదు. ఎవ‌రి సొమ్ము ఎత్తుకుపోలేద‌ని మీనా అంటుంది. క‌నీసం పుస్తెలు అయినా తీసుకోమ‌ని స‌త్యం అంటాడు. న‌న్ను క్ష‌మించ‌మ‌ని, ఆ బంగారం త‌న‌కు వ‌ద్ద‌ని స‌త్యంతో అంటుంది మీనా.

స్థోమ‌త లేదు…

మాపుట్టింటికి బంగారం కొనే స్థోమ‌త లేదు. లేన‌ట్లే ఉంటాన‌ని మీనా ఎమోష‌న‌ల్ అవుతుంది. నా పుట్టింటికి గ‌తి లేదు. మేము ఏనాడు మీ ఇంటి కోడ‌లిని చేసుకోమ‌ని ఆడ‌గ‌లేదు. మీరే గొప్ప మ‌న‌సుతో న‌న్ను మీ ఇంటి కోడ‌లిని చేసుకున్నారు. నా పుట్టింటిని, న‌న్ను త‌క్కువ చేసి అత్త‌య్య మాట్లాడారు. అందుకే మీరు పుట్టిన బంగారం చ‌చ్చే దాకా వేసుకోన‌ని చెబుతుంది.

పంతానికి పోతే…

నా భ‌ర్త క‌ష్ట‌ప‌డి బంగారం కొంటారు. అప్పుడు ద‌ర్జాగా వేసుకుంటాను. పంతానికి వ‌స్తే ఆయ‌న ఇప్పుడే కొంటార‌ని మీనా అంటుంది. బాలు చేసేదే డ్రైవ‌ర్ ప‌ని, ల‌క్ష‌లు పెట్టి బంగారం కొన‌స్తాడ‌ట అంటూ వెట‌కారం ఆడుతుంది. బాలును న‌మ్ముకుంటే పుస్తెల తాడు కాకుండా ప‌సుపుతాడుతోనే జీవితాంతం ఉండాలి అంటూ ప్ర‌భావ‌తి దెప్పిపొడుస్తుంది.

బాలుపై న‌మ్మ‌క‌ముంది…

నా భ‌ర్త నిజాయితీగా సంపాదిస్తున్నాడ‌ని, త‌న తోడ‌బుట్టిన చెల్లెలికి చేయించిన మ‌నిషి నాకు పుస్తెల‌తాడు చేయించ‌లేడా…నా భ‌ర్త‌పై నాకు న‌మ్మ‌క‌ముంద‌ని మీనా అంటుంది. నా భ‌ర్త‌ను ఎప్ప‌టికీ న‌మ్ముతాన‌ని అంటుంది. నీకు నీ కొడుకును న‌మ్మ‌కం లేదు.

కానీ బ‌య‌టి నుంచి వ‌చ్చిన అమ్మాయి న‌మ్ముతుంది అని ప్ర‌భావ‌తికి క్లాస్ ఇస్తాడు స‌త్యం. మీనా హారాలు, న‌గ‌లు అడ‌గ‌టం లేద‌ని, క‌నీసం పుస్తెలు అయినా చేయించ‌మ‌ని బాలుకు చెబుతుంది. బాలును న‌మ్మి ఉన్న న‌గ‌లు వ‌ద్దంటుంద‌ని, వెర్రిమాలోకం అని మీనా చుల‌క‌న చేసి మాట్లాడుతుంది ప్ర‌భావ‌తి.

బాలు థాంక్స్‌…

కారు డ్రైవ‌ర్స్ అంద‌రూ క‌లిసి చిట్ వేస్తారు. ఆ చిట్‌ను రాజేష్ తీసుకోవాల‌ని వ‌స్తాడు. బాలు కూడా చిట్ కోసం రావ‌డంతో స్నేహితుడి కోసం బాలు త్యాగం చేయ‌బోతాడు. కానీ రాజేష్ అందుకు ఒప్పుకోడు. నువ్వే తీసుకోమ‌ని బాలుతో అంటాడు. చిట్ గురించి ఎప్పుడు ఆలోచించ‌ని వాడివి, నువ్వే ఇక్క‌డికి వ‌చ్చావంటే నీకు ఎంత అవ‌స‌ర‌ముందో అర్థ‌మ‌వుతుంద‌ని అంటాడు.

మీనాకు బంగారు తాళి కొనాల‌ని చాలా రోజులుగా అనుకుంటున్నాన‌ని బాలు అంటాడు. మొన్న ఊరెళ్లిన‌ప్పుడు మీనా మెడ‌లోని ప‌సుపుకొమ్ము చూసి బాదేసింద‌ని రాజేష్ అంటాడు. మిగిలిన డ్రైవ‌ర్లు కూడా బాలుకే చిట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుంటారు. అంద‌రికి బాలు థాంక్స్ చెబుతాడు.

మౌనిక త‌ల‌కు క‌ట్టు…

మీనా కోసం తాళిబొట్టు కొనుక్కొని ఇంటికి వెళుతుంటాడు బాలు. దారిలో కారు రిపేర్ చేస్తూ సంజు క‌నిపిస్తాడు. సంజును చూసి చిరాకుప‌డ‌తాడు బాలు. వీడికి ఇలాగే కావాల‌ని అనుకుంటాడు. కానీ ప‌క్క‌నే త‌ల‌కు క‌ట్టుతో మౌనిక క‌నిపించ‌డంతో బాలు కంగారుగా కారు ఆపేస్తాడు.

త‌ల‌కు క‌ట్టు ఏంటి? ఏమైంద‌ని అడుగుతాడు. అది మా ఇంటి విష‌యం నీకు అన‌వ‌స‌రం అని సంజు అంటాడు. వీడే నిన్ను ఏమ‌న్నా చేశాడా? భ‌య‌కుండాచెప్పు…ఇక్క‌డే వీడిని న‌రికేస్తాన‌ని సంజుకు వార్నింగ్ ఇస్తాడు.

బాలు కాల‌ర్ ప‌ట్టుకున్న సంజు…

నీ కోస‌మే చూస్తున్నాన‌ని కోపంగా బాలు కాల‌ర్ ప‌ట్టుకుంటాడు సంజు. బాలు కూడా అత‌డిని కొట్ట‌బోతాడు. మౌనిక ఆపేస్తుంది. తానే మెట్ల‌పై నుంచి ప‌డ్డాన‌ని అబ‌ద్ధం ఆడుతుంది. సంజునే త‌న‌ను హాస్పిట‌ల్ తీసుకెళ్లాడ‌ని చెబుతుంది. నాకేం కాలేద‌ని ఇక్క‌డి నుంచి వెళ్లిపోమ‌ని బాలుతో అంటుంది మౌనిక‌.

నువ్వు చెప్పింది అబ‌ద్ధ‌మ‌ని తెలిసినా…వీడి మూలంగానే గాయ‌మైంద‌నే నా అనుమానం నిజమ‌ని తెలిసినా వీడిని బూడిద చేస్తాన‌ని సంజుకు వార్నింగ్ ఇస్తాడు. కారు రిపేర్ చేసి వెళ్లిపోతాన‌ని బాలు అంటాడు. అవ‌స‌రం లేద‌ని సంజు కోపంగా బ‌దులిస్తాడు. మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి వెళ్లిపోమ‌ని మౌనిక కూడా అంటుంది. నిన్ను ఈ ప‌రిస్థితుల్లో వ‌దిలేసి వెళ్ల‌లేన‌ని బాలు బ‌దులిస్తాడు. వీడిలా రాక్ష‌సుడిని కాద‌ని, మ‌నిషిన‌ని సంజును చూపిస్తూ బాలు అంటాడు.

బోడి సాయం అవ‌స‌రం లేదు…

సంజుకు సారీ చెబుతాడు. కారు రిపేర్ చేయ‌బోతాడు. కానీ ఇంజిన్‌లో ప్రాబ్లెమ్ ఉండ‌టంతో కారు స్టార్ట్ కాదు. కారును షెడ్‌కు పంపించాల్సిందేన‌ని బాలు చెబుతాడు. త‌న కారులో ఇంట్లో దించుతాన‌ని అంటాడు. నీ బోడి సాయం నాకు అక్క‌ర‌లేద‌ని సంజు బ‌దులిస్తాడు. మౌనిక కూడా బాలు కారు ఎక్క‌న‌ని అంటుంది.

రెండు వంద‌లు చాలు…

క్యాబ్ అనుకొని త‌న కారు ఎక్క‌మ‌ని సంజుతో చెబుతాడు బాలు. సంజును సార్ అని పిలుస్తాడు. త‌న‌కు రెండు వంద‌లు ఇస్తే చాల‌ని అంటాడు. పాత కారు అయినా నా లెవెల్‌కు స‌రిపోక‌పోయినా ఎక్కుతున్నాన‌ని సంజు బిల్డ‌ప్‌లు ఇస్తాడు. మీనా కోసం కొన్న పుస్తెలు మౌనిక‌కు చూపిస్తాడు బాలు. ఎలా ఉన్నాయో చెప్ప‌మ‌ని అంటాడు. చాలా బాగున్నాయ‌ని మౌనిక ఆనందంగా చెబుతుంది. అవి రోల్డ్ గోల్డా అని సంజు వెట‌కారం ఆడుతాడు. నీకు గోల్డ్ ఏదో…రోల్డ్ గోల్డ్ ఏదో నీకు ఎప్ప‌టికీ తెలియ‌ద‌ని బాలు పంచ్ వేస్తాడు.

ట్రిప్పుల కోసం అడుక్కుంటావా…

పెళ్లై ఇంత‌కాల‌మైన పుస్తెలు కొన‌లేదా? అందుకే మెడ‌లో ప‌సుపుకొమ్ము క‌ట్టుకొని తిరుగుతుందా అని బాలును త‌క్కువ చేసి మాట్లాడుతాడు సంజు. ఒక డ్రైవ‌ర్‌వి నాకు పుస్తెలు ఎలా కొన‌గ‌ల‌వు అని చుల‌క‌గా అంటాడు. ప్ర‌తిరోజు ట్రిప్పుల కోసం ఇలాగే అడ‌క్కుంటావా అని చెబుతాడు. గ‌తిలేక‌పోయినా పొగ‌రుకు మాత్రం త‌క్కువ లేద‌ని సంజు అంటాడు.

క‌థ వేరేలా ఉంటుంది…

నాకు తిండి పెట్టే వృతి ఏదైనా దేవుడితో స‌మాన‌మ‌ని బాలు బ‌దులిస్తాడు. ప్యాసింజ‌ర్‌వి ప్యాసింజ‌ర్‌లా మాట్లాడు. నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల్లో జోక్యం చేసుకుంటే క‌థ వేరేలా ఉంటుంద‌ని వార్నింగ్ ఇస్తాడు. అన్న‌య్య అని బాలును మౌనిక పిలుస్తుంది. ఏవ‌డే నీకు అన్న‌య్య‌. వీడు ఆఫ్ట్రాల్ డ్రైవ‌ర్ అని సంజు ఇన్‌స‌ల్ట్ చేస్తాడు.

పొర్లించి కొడ‌తా…

ఇంటి ద‌గ్గ‌ర‌కు రాగానే క్యాబ్ ఛార్జీలు బాలుపై విసిరేటి వెళ్లిపోబోతాడు. డ‌బ్బు ఉంద‌న్న పొగ‌రా…మ‌ర్యాద‌గా వ‌చ్చి కింద ప‌డ్డ డ‌బ్బులు తీసి ఇవ్వ‌క‌పోతే నీ మ‌నుషుల ముందే పొర్లించి కొడ‌తాను అని సంజుకు వార్నింగ్ ఇస్తాడు బాలు. చెల్లెలు మొగుడివి అని కూడా చూడ‌న‌ని అంటాడు.

మీనా గ‌ర్వం…

మీనా కోసం తాను కొన్న పుస్తెలు ప్ర‌భావ‌తికి చూపిస్తాడు బాలు. బోడి తులం కూడా లేని బంగారం కొని షాప్ మొత్తం కొన్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇస్తున్నావేంటి అని ప్ర‌భావ‌తి అంటుంది. ఆయ‌న బంగారం కొన‌లేర‌ని మీరు అన్నారు. ఇవాళే కొంటార‌ని నేను అన్నాను. అన్న మాట నిల‌బెట్టుకున్నారు. ఇది నా భ‌ర్త అంటే అని మీనా గ‌ర్వంగా చెబుతుంది. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024