





Best Web Hosting Provider In India 2024

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి అంథాలజీ మూవీ.. నలుగురి జీవితాలతో ఎమోషనల్, క్రైమ్ డ్రామా.. ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి తమిళ అంథాలజీ ఎమోషనల్, క్రైమ్ డ్రామా సినిమా నిరమ్ మారుమ్ ఉలగిల్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రకటనను సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ట్రైలర్ రిలీజ్ చేస్తూ ప్రకటించింది. నలుగురి జీవితాల చుట్టూ జరిగే ఎమోషనల్, క్రైమ్ డ్రామాగా వచ్చిన నిరమ్ మారుమ్ ఉలగిల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.
ఓటీటీలోకి ఎన్నో రకాల జోనర్స్‌తో సినిమాలు వస్తుంటాయి. వాటిలో కొన్ని థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే, మరికొన్ని డిజాస్టర్ మూవీస్ కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలో నెల రోజుల్లోనే ఓటీటీలోకి సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుంటే మరికొన్ని నెల దాటిన తర్వాత డిజిటల్ ప్రీమియర్ అవుతోన్నాయి.
నలుగురి జీవితాలకు సంబంధించి
అలా నెలన్నర తర్వాత ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే నిరమ్ మారుమ్ ఉలగిల్. నలుగురు జీవితాలకు సంబంధించిన ఎమోషనల్, క్రైమ్ డ్రామాతో అంథాలజీ సినిమాగా నిరమ్ మారుమ్ ఉలగిల్ తెరకెక్కింది. ఇది క తమిళ చిత్రం. నిరమ్ మారుమ్ ఉలగిల్ అంటే తెలుగులో ‘రంగులు మారుతున్న ప్రపంచం’ అని అర్థం వస్తుంది.
డైరెక్టర్‌గా డెబ్యూ ఎంట్రీ
టైటిల్‌కి తగినట్లుగానే పరిస్థితులకు అనుగుణంగా సినిమాలోని పాత్రలు మారుతుంటాయి. నాలుగు విభిన్నమైన కథలతో తెరకెక్కిన నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమాకు బ్రిట్టో జేబీ కథ, దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే బ్రిట్టో జేబీ డైరెక్టర్‌గా తమిళంలో డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు. కుటుంబం సంబంధాలు, తల్లిదండ్రులను విడిచిపెట్టిన కొడుకులు, భార్యాభర్తలు విడిపోవడం, గ్యాంగ్‌స్టర్ క్రైమ్ వంటి వివిధ అంశాలతో ఈ మూవీని చిత్రీకరించారు.
నిరమ్ మారుమ్ ఉలగిల్ నటీనటులు
నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమాలో దర్శకదిగ్గజం భారతీ రాజా ప్రధాన పాత్ర పోషించారు. అలాగే, రియో రాజ్, యోగి బాబు, నట్టి సుబ్రమణ్యం, వడివుక్కరసి, తెలుగు మూవీ ఒట్టేసి చెప్తున్న హీరోయిన్ కనిహా, మైమ్ గోపీ, ఆర్య కృష్ణన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మార్చి 7న థియేటర్లలో విడుదలైన నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.
నిరమ్ మారుమ్ ఉలగిల్ ఓటీటీ రిలీజ్
ఐఎమ్‌డీబీ నుంచి పదికి 5.9 రేటింగ్‌ను సాధించుకున్న నిరమ్ మారుమ్ ఉలగిల్ ఓటీటీలోకి రానుంది. తాజాగా ఇవాళ (ఏప్రిల్ 24) నిరమ్ మారుమ్ ఉలగిల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 25 నుంచి సన్ ఎన్ఎక్స్‌టీలో నిరమ్ మారుమ్ ఉలగిల్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళంలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మరికొన్ని గంటల్లో నిరమ్ మారుమ్ ఉలగిల్ ఓటీటీ రిలీజ్ కానుంది.
మరికొన్ని గంటల్లోనే
ఏప్రిల్ 25 అర్ధరాత్రి 12 గంటల నుంచి నిరమ్ మారుమ్ ఉలగిల్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ లెక్కన అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. నెలన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చిన నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమాను సిగ్నేచర్ ప్రొడక్షన్స్, జీఎస్ సినిమాస్ ఇంటర్నేషనల్ పతాకాలపై నిర్మించారు. దేవ్ ప్రకాష్ రేగన్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం