ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హోటల్‌కు రమ్మని పిలిచి, యువతిని కట్టేసి నగలతో ఉడాయించాడు..

Best Web Hosting Provider In India 2024

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హోటల్‌కు రమ్మని పిలిచి, యువతిని కట్టేసి నగలతో ఉడాయించాడు..

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

విజయవాడలో విచిత్రమైన దొంగతనంపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన యువకుడిని కలిసేందుకు హోటల్‌కు వెళ్లిన యువతిని ఆమె దుస్తులతోనే కట్టేసి నగలు అపహరించి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇన్‌స్టాలో పరిచయంతో హోటల్‌కు వెళ్లి నిలువు దోపిడీకి గురైనయువతి
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

విజయవాడ మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన యువకుడు పిలిచాడని హోటల్‌కు వెళ్లిన యువతి నిలువుదోపిడీకి గురైంది.

విజయవాడ మాచవరంలో హోటల్లో ఏకాంతంగా ఉన్న సమయంలో యువతిని ఆమె దుస్తులతోనే బంధించి ఆమె దగ్గర ఉన్న నగలతో ఉడాయించాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడకు చెందిన యువతికి ఇన్ స్టా గ్రామ్‌లో నెల రోజుల క్రితం ఓ యువకుడు పరిచయం అయ్యాడు.

ఇద్దరి తరచూ మాట్లాడుకున్నారు. ముక్కు ముఖం తెలియని యువకుడితో యువతి చనువు పెంచేసుకుంది. యువకుడి మాటలు నమ్మేసి యువతి అతడి ఉచ్చులో చిక్కిన తర్వాత ఆమెను ఏకాంతంగా కలవాలని పిలిచాడు.

దీంతో మంగ ళవారం సాయంత్రం మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హోటల్‌కు రమ్మని ఆమెని పిలిచాడు. హోటల్ గదిలోకి వెళ్లగానే ఆమె శరీరంపై దుస్తులు తొలగించి, వాటితోనే ఆమె చేతులు, కాళ్లు కట్టేశాడు.

ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న సుమారు 20 గ్రాముల బంగారు గొలుసు తీసుకొని పరారయ్యాడు. యువతి అరగంట తర్వాత కట్లు విప్పుకుని హోటల్‌ నుంచి బయటపడింది. బుధవారం ఈ ఘటనపై మాచవరం పోలీసులకు పిర్యాదు చేసింది.

యువతితో చాట్ చేసిన సమయంలో యువకుడి ఫోన్ నెంబర్ సహా ఇతర వివరాలు ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. సోషల్ మీడియా మెసేంజెర్లతోనే ఆమెతో చాట్ చేసేవాడు. దీంతో అతని ఇన్‌ స్టా గ్రామ్ ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నింది తుడి కోసం ప్రత్యేక బృందా లతో గాలిస్తున్నామని పోలీ సులు తెలిపారు. యువతి చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

VijayawadaCrime ApInstagramSocial MediaCrime NewsAp Crime News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024