





Best Web Hosting Provider In India 2024

బుల్లితెరపై రామ్ చరణ్ సందడి.. టీవీలోకి గేమ్ ఛేంజర్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడ అంటే?
బుల్లితెరపైకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సందడి చేయనున్నాడు. అది కూడా తాను రీసెంట్‌గా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్‌తో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ టీవీ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. గేమ్ ఛేంజర్ ఏ టీవీ ఛానెల్‌లో ప్రసారం కానుందో తెలుసుకుందాం.
వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది జీ తెలుగు.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ గ్లామర్ బ్యూటి కియారా అద్వానీ మరోసారి జంటగా నటించిన చిత్రమే గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాలో మరో హీరోయిన్‌గా తెలుగు బ్యూటి అంజలి కూడా నటించింది. ఇక రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటించాడు.
రామ్ చరణ్ సందడి
థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న గేమ్ ఛేంజర్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే, ఇప్పుడు బుల్లితెరపై గేమ్ ఛేంజర్ సినిమాతో రామ్ చరణ్ సందడి చేయనున్నాడు. అది కూడా జీ తెలుగు టీవీ ఛానెల్‌లో. ఈ ఆదివారం అంటే ఏప్రిల్ 27న జీ తెలుగులో గేమ్ ఛేంజర్ మూవీ వరల్డ్ వైడ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది.
జీ తెలుగు ప్రకటన
ఏప్రిల్ 27న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో గేమ్ ఛేంజర్ ప్రసారం కానుందని తాజాగా టీవీ ఛానెల్ ప్రకటించింది. జీ తెలుగు ప్రేక్షకులు గేమ్ ఛేంజర్ సినిమాను మిస్ కాకుండా చూడగలరు అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు.
కలెక్టర్ రామ్ నందన్ చుట్టూ
ఇక గేమ్ ఛేంజర్ కథ విషయానికొస్తే.. విశాఖపట్నంలో కొత్తగా నియమితులైన కలెక్టర్ రామ్ నందన్ IAS (రామ్ చరణ్) చుట్టూ తిరుగుతుంది. అతని నిజాయితీ, అంకితభావం అతన్ని ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) కుమారుడైన బొబ్బిలి మోపిదేవి (ఎస్‌జె సూర్య)తో విభేదాలకు దారితీస్తుంది.
జీ తెలుగులో
మోపిదేవి అక్రమ కార్యకలాపాల్లో లీనమై ఉంటాడు. రామ్ తనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడు? రామ్ ముఖ్యమంత్రి అవుతాడా? మోపిదేవి తన ఆశయాల కోసం ఎంత దూరం వెళ్తాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే గేమ్ ఛేంజర్ సినిమాను చూడాల్సిందే.
గేమ్ ఛేంజర్ నటీనటులు
ఇదిలా ఉంటే, గేమ్ ఛేంజర్ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలితోపాటు వర్సటైల్ యాక్టర్ ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సముద్రఖని వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా.. ఎస్ తమన్ సంగీతం అందించారు.
గేమ్ ఛేంజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
ఇక అమెజాన్ ప్రైమ్, జీ5లలో గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ అయితే.. జీ5లో కేవలం హిందీ భాషలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం
టాపిక్