తెలంగాణ బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు – ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే..! ముఖ్య వివరాలివే

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు – ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే..! ముఖ్య వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

రాష్ట్రంలోని బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ పాస్ అయిన విద్యార్థులు ఇందుకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన విద్యార్థులు మే 12వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.

తెలంగాణ బీసీ గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశాల
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.

ఆన్ లైన్ దరఖాస్తులు…

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. ఇందుకు మే 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్ష లేకుండా…. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉండనుంది. మెరిట్ తో పాటు రిజర్వేషన్లను ప్రమాణికంగా తీసుకుంటారు. వీటి ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ ఈసీతో పాటు వొకేషనల్ కోర్సుల్లో కూడా సీట్లను చేపడుతారు.

అర్హులైన విద్యార్థులు https://mjpabcwreis.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి. ఇందుకు రూ. 200 ఫీజు చెల్లంచాలి. బీసీ విద్యార్థులకు ఫీజు ఉండదు. కేవలం ఆన్ లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. ఫీజు జర్నల్ నెంబర్, టెన్త్ హాల్ టికెట్ నెంబర్ తో పాటు ఇతర వివరాల ఆధారంగా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్థులు సమర్పించాల్సిన పత్రాలు:

మెరిట్ ఆధారంగా సీట్లు పొందే విద్యార్థులు అడ్మిషన్ సమయంలో ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో టీసీ, పదో తరగతి మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయపు ధ్రువీకరణపత్రం, ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్, పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, మూడు సెట్ల జిరాక్స్ కాపీలను ఇవ్వాలి.

ఇందులో సీట్లు పొందే విద్యార్థులకు నీట్, ఎంసెట్, ఐఐటీ, సీఏ, సీపీటీ లేదా క్లాట్ కోచింగ్ కూడా ఇస్తారు. అంతేకాకుండా విద్యార్థులకు హాస్టల్ సదుపాయం ఉంటుంది. ఆధునాతమైన ల్యాబ్స్ తో పాటు సరైన వసతులు కల్పిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 130 జూనియర్‌ కాలేజీలలో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్‌ కాలేజీల్లో బాలికలకు 10,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 040-23328266 నెంబర్ ను సంప్రదించవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి బీసీ గురుకుల జూనియర్ కాలేజీ ప్రవేశాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు….

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

AdmissionsEntrance TestsTelangana NewsEducation
Source / Credits

Best Web Hosting Provider In India 2024