సీరియల్‌లో తల్లీకొడుకులు.. రియల్ లైఫ్‌లో మాత్రం భార్యాభర్తలు.. బిగ్ బాస్ బ్యూటీ లవ్ స్టోరీ ఇదే!

Best Web Hosting Provider In India 2024

సీరియల్‌లో తల్లీకొడుకులు.. రియల్ లైఫ్‌లో మాత్రం భార్యాభర్తలు.. బిగ్ బాస్ బ్యూటీ లవ్ స్టోరీ ఇదే!

Sanjiv Kumar HT Telugu

సీరియల్‌లో తల్లీకొడుకులుగా నటించిన బిగ్ బాస్ జంట కిష్వర్ మర్చంట్, సుయాష్ రాయ్ రియల్ లైఫ్‌లో మాత్రం భార్యాభర్తలుగా మారారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. హిందీ బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న కిషర్ మర్చంట్, సుయాష్ రాయ్ లవ్ స్టోరీ, పెళ్లి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయి.

సీరియల్‌లో తల్లీకొడుకులు.. రియల్ లైఫ్‌లో మాత్రం భార్యాభర్తలు.. బిగ్ బాస్ బ్యూటీ లవ్ స్టోరీ ఇదే!

సినిమాల్లో హీరో హీరోయిన్స్‌గా నటించిన పాపులర్ యాక్టర్స్ అదే మూవీస్‌లో అన్నా చెల్లెలి పాత్రల్లో, తల్లీకొడుకులుగా నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలుగులోనే సైరా నరసింహా రెడ్డి సినిమాలో చిరంజీవికి హీరోయిన్‌గా నటించిన నయనతార గాడ్ ఫాదర్ మూవీలో చెల్లెలిగా నటించిన విషయం తెలిసిందే.

భార్యాభర్తలుగా మారి

అయితే, ఇదంతా సినీ ఇండస్ట్రీలో చాలా సాధారణమైన విషయం. కానీ, తల్లికొడుకులుగా నటించిన వారు నిజంగా భార్యాభర్తలు అవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే, ఇది నిజంగానే జరిగింది. ఓ సీరియల్‌లో తల్లికొడుకులుగా నటించిన ఇద్దరు రియల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా మారారు. వారే హిందీ టెలివిజన్ యాక్టర్స్, మోడల్స్ అయిన కిష్వర్ మర్చంట్ (44), సుయాష్ రాయ్ (36).

ఎనిమిదేళ్ల చిన్నోడు

సుయాష్ రాయ్ కంటే కిష్వర్ మర్చంట్ 8 సంవత్సరాలు పెద్దది. కానీ, లవ్, మ్యారేజ్‌కు అదేం అడ్డు కాదని అనేక సవాళ్లు ఎదుర్కొన్ని నిజ జీవితంలో దంపతులయ్యారు కిష్వర్, సుయాష్ రాయ్. వీరికి నిర్వైర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. బాలీవుడ్ మోడల్ అయిన కిష్వర్ మర్చంట్ పలు టీవీ సీరియల్స్‌లో నటించింది.

కిష్వర్ మర్చంట్ సీరియల్స్, సినిమాలు

హిందీలో శక్తిమాన్, హిప్ హాప్ హుర్రే, ఏక్ హసీనా థీ, ఇత్నా కరో నా ముఝే ప్యార్, ప్యార్ కీ యే ఏక్ కహానీ, కైసీ యే యారియాన్, ధడ్కన్, కమ్మల్, క్యా హడ్సా క్యా హకీకత్, పియా కా ఘర్, కసం సే వంటి అనేక బుల్లితెర ధారావాహికల్లో పలు పాత్రలు పోషించిన కిష్వర్ మర్చంట్ బేజా ఫ్రై 2, మార్నే భి దో యారోన్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది.

సుయాష్ రాయ్ సీరియల్స్

ఇక సుయాష్ రాయ్ డేంజరస్ ఓటీటీ వెబ్ సిరీస్, ప్యార్ కీ యే ఏక్ కహానీ, క్యా హువా తేరీ వాదా, యే హై ఆషిఖీ, కైసే హై ఇష్క్ హై.. అజబ్ సా రిస్క్ హై, పిర్ బీ నా మానే బత్తమీజ్ దిల్, ఏక్ థా రాజా ఏక్ థీ రాణి, లాల్ ఇష్క్ వంటి సీరియల్స్‌తోపాటు పలు టీవీ షోలలో పాల్గొన్నాడు సుయాష్ రాయ్.

2010లో తల్లికొడుకులుగా

2010లో ప్రారంభమైన ప్యార్ కీ యే కహానీ సీరియల్‌లో కిష్వర్ మర్ంట్ తల్లిగా నటిస్తే.. సుయాష్ రాయ్ ఆమెకు కొడుకుగా యాక్ట్ చేశాడు. తెరపై తల్లిదండ్రులుగా నటించిన వీరిద్దరు 2016లో వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. పలువురు నెగెటివ్‌గా కామెంట్స్ చేసిన ఈ జంట మాత్రం పట్టించుకోలేదు.

బిగ్ బాస్ హిందీలో జంటగా

ఇక 2015లో బిగ్ బాస్ హిందీ సీజన్ 9లో కిష్వర్ మర్చంట్, సుయాష్ రాయ్ జంటగానే కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. అటు సీరియల్స్‌లో కలిసి నటించండం, ఇటు బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో పాల్గొనడంతో ఇరువురిపై ప్రేమ మొదలైంది. ఆ లవ్ స్టోరీ పెళ్లి పీటల వరకు వెళ్లి భార్యాభర్తలుగా మారారు కిష్వర్-సుయాష్.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024