నాకు పాకిస్థానీ మిలిటరీతో ఎలాంటి సంబంధం లేదు.. అవన్నీ పుకార్లే.. నేను ఇండియన్ అమెరికన్: ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ వివరణ

Best Web Hosting Provider In India 2024

నాకు పాకిస్థానీ మిలిటరీతో ఎలాంటి సంబంధం లేదు.. అవన్నీ పుకార్లే.. నేను ఇండియన్ అమెరికన్: ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ వివరణ

Hari Prasad S HT Telugu

పాకిస్థానీ మిలిటరీతో తన కుటుంబానికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ప్రభాస్ మూవీ ఫౌజీలో నటిస్తున్న ఇమాన్వీ స్పందించింది. గురువారం (ఏప్రిల్ 24) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పెద్ద పోస్ట్ పెట్టింది. ఈ ఆరోపణలను ఆమె ఖండించింది.

నాకు పాకిస్థానీ మిలిటరీతో ఎలాంటి సంబంధం లేదు.. అవన్నీ పుకార్లే.. నేను ఇండియన్ అమెరికన్: ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ వివరణ

ప్రభాస్, హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్ ఇస్మాయిల్ అలియాస్ ఇమాన్వీ తన పాకిస్థాన్ సంబంధాల ఆరోపణలపై స్పందించింది. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వీ.. పాకిస్థాన్ సంబంధాలపై సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. ఆమెకు మన సినిమాల్లో అవకాశాలు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. దీనిపై ఇమాన్వీ స్పందించింది.

వాళ్లందరికీ నివాళులు: ఇమాన్వీ

ఇమాన్వీ గురువారం (ఏప్రిల్ 24) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ఈ దాడి జరిగినప్పటి నుంచీ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వివరణ ఇచ్చింది. “మొదటగా పహల్గామ్ లో జరిగిన దాడిలో మరణించిన వారికి నా హృదయపూర్వక నివాళులు.

నా ఆలోచనలన్నీ వాళ్ల గురించే. ఏ అమాయక ప్రాణం పోయినా నా గుండె తరుక్కుపోతుంది. ఈ హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి రోజూ కళ ద్వారా ప్రేమను పంచే మిషన్ పై ఉన్న నేను త్వరలోనే మనమంతా ఒక్కటే అనే రోజు కోసం ఎదురు చూస్తున్నాను” అని ఇమాన్వీ రాసింది.

అందులో నిజం లేదు

ఇక తన గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతుండటంపై ఇమాన్వీ ఈ పోస్టులో స్పందించింది. “విభజన సృష్టించడానికి, విద్వేషాలను రేపడానికి తప్పుడు వార్తల ద్వారా నాపై, నా కుటుంబంపై వ్యాప్తి చేస్తున్న పుకార్లపైనా స్పందించాలని అనుకుంటున్నాను. అసలు నా కుటుంబంలోని ఎవరూ పాకిస్థాన్ వెళ్లలేదు.

పాకిస్థాన్ మిలిటరీ ఎవరికీ ఎలాంటి సంబంధాలు లేవు. కేవలం విద్వేషాన్ని సృష్టించే ఉద్దేశంతోనే దీంతోపాటు మరిన్ని పుకార్లు వ్యాపింపజేస్తున్నారు. పెద్ద పెద్ద వార్తా సంస్థలు, జర్నలిస్టులు కూడా ఈ వార్తల వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా ఆ వార్తలను అలాగే ప్రచురించడం మరింత బాధ కలిగిస్తోంది” అని ఇమాన్వీ చెప్పింది.

నేను ఇండియన్ అమెరికన్

“నేనో ఇండియన్ అమెరికన్. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లిష్ మాట్లాడలను. నేను లాస్ ఏంజిల్స్ లో పుట్టాను. నా పేరెంట్స్ చాలా ఏళ్ల కిందటే అమెరికాకు వలస వెళ్లారు. ఆ తర్వాత వాళ్లు అమెరికా పౌరులుగా మారారు. నేను అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత ఆర్ట్స్ కెరీర్ తీసుకొని నటి, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ గా మారాను. నాకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వచ్చాయి. భారతీయ గుర్తింపు, సంస్కృతి నా రక్తంలోనే ఉంది. నా కళ ద్వారా ఏకత్వాన్ని చాటే ప్రయత్నం చేస్తాను” అని ఇమాన్వీ స్పష్టం చేసింది.

హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న మూవీలో ఇమాన్వీ ఫిమేల్ లీడ్ గా ఉంది. ఇందులో మిథున్ చక్రవర్తి, జయప్రద కూడా నటిస్తున్నారు. ఇదొక పోరాట యోధుడి కథ. 1940ల నేపథ్యంలో తెరకెక్కుతోంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024