





Best Web Hosting Provider In India 2024

గేమ్ ఛేంజర్ స్టోరీని మార్చేశారు.. అందరూ కలిసి ఇలా.. అనుకున్నదొకటి అయిందొకటి: తమిళ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
గేమ్ ఛేంజర్ మూవీ కథ, స్క్రీన్ ప్లేను పూర్తిగా మార్చేశారని తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను అనుకున్న ప్రపంచం ఒకటి కాగా.. అది పూర్తిగా వేరేగా మారిపోయిందని అతడు అనడం గమనార్హం.
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి కథ అందించింది తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. త్వరలోనే సూర్యతో కలిసి అతడు తీసిన రెట్రో మూవీ రిలీజ్ కానుండగా.. గలాటా ప్లస్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. అసలు తాను ఇచ్చిన స్టోరీతోపాటు మూవీ స్క్రీన్ ప్లే పూర్తిగా మారిపోయినట్లు వెల్లడించాడు.
నేను చెప్పింది వేరే..
నిజానికి గేమ్ ఛేంజర్ కోసం తాను డైరెక్టర్ శంకర్ కు ఇచ్చిన స్టోరీ ఆ తర్వాత ఎంతో మంది ఇతర రచయితలు రావడంతో మారిపోయినట్లు కార్తీక్ సుబ్బరాజ్ చెప్పాడు. ఈ స్టోరీ గురించి కార్తీక్ ఏమన్నాడంటే.. “నేను స్టోరీ ఔట్ లైన్ చెప్పాను. వన్ లైనర్.
ఎంతో హుందాగా ఉండే ఓ ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయ నాయకుడు అవుతాడని నేను శంకర్ కు చెప్పాను. నేను స్టోరీని శంకర్ సార్ కు ఇచ్చినప్పుడు దానిని ఎంత ఘనంగా తీస్తాడో అన్న ఆసక్తి నాలో ఉంది. నేను పరిచయం చేసిన ప్రపంచం అది. కానీ అది చివరికి ఓ పూర్తి భిన్నమైన ప్రపంచంగా మారిపోయింది” అని కార్తీక్ అన్నాడు.
వాళ్లందరూ రావడంతోనే ఇలా..
గేమ్ ఛేంజర్ కథ ఎలా మారిపోయిందో కూడా కార్తీక్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. “ఇందులో చాలా మంది, చాలా రైటర్స్ ప్రమేయం ఉంది. స్క్రీన్ ప్లే చాలా మార్చారు. స్టోరీని కూడా ఎంతో కొంత మార్చేశారు. కానీ సినిమాలకు ఏది బాగుంటుందన్న విషయాన్ని మనం నిర్ధారించలేము. ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకు ఎక్కలేదన్నది ఎవరూ చెప్పలేరు” అని కార్తీక్ సుబ్బరాజ్ అనడం విశేషం.
నిజానికి ఈ గేమ్ ఛేంజర్ సినిమా చూసిన తర్వాత కార్తీక్ ఓ ట్వీట్ చేశాడు. ఇదొక సూపర్ ఎంటర్టైనింగ్ మూవీ అని, శంకర్ స్టైల్ గ్రాండ్ మాస్ యాక్షన్ వైబ్స్ ఉన్నాయని అన్నాడు. ఈ సినిమాలో తననూ ఓ భాగం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన రెట్రో మూవీ మే 1న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూర్య లీడ్ రోల్లో నటించాడు.
ఇక గేమ్ ఛేంజర్ మూవీ విషయానికి వస్తే ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. శంకర్ కు ఇండియన్ 2 తర్వాత మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడీ మూవీ వచ్చే ఆదివారం జీ తెలుగులో టీవీ ప్రీమియర్ కానుంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం