Best Web Hosting Provider In India 2024
ఆసియా యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025లో భారతీయ విద్యాసంస్థల స్థానం ఇదే..
ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) అగ్రస్థానంలో నిలిచింది. ఇతర విశ్వవిద్యాలయాల జాబితాను ఇక్కడ పరిశీలించండి.
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025ను విడుదల చేసింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న కొన్ని ఉత్తమ భారతీయ విశ్వవిద్యాలయాల జాబితా ఇక్కడ ఉంది. ఈ జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లేదా ఐఐఎస్సీ భారత్ లో టాప్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అవతరించింది. అన్నా విశ్వవిద్యాలయం రెండవ స్థానంలో ఉంది.
ఆసియా యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025లో చోటు దక్కించుకున్న టాప్ 7 భారతీయ ఇన్ స్టిట్యూట్ లు ఇవే.
1.ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
ఆసియా యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025 లో భారత్ లోని విద్యా సంస్థల్లో ఐఐఎస్సీ తొలి స్థానం సాధించింది. మొత్తం ఆసియా ర్యాంకింగ్స్ లో , ఓవరాల్ గా 65.2 మార్కులు సాధించి ఐఐఎస్సీ 38వ ర్యాంకులో నిలిచింది.
RANK | RESEARCH QUALITY | INDUSTRY | INTERNATIONAL OUTLOOK | RESEARCH ENVIRONMENT | TEACHING |
---|---|---|---|---|---|
38 | 64.1 | 97.3 | 31.6 | 61.5 | 68.1 |
2. అన్నా యూనివర్శిటీ
రెండో స్థానంలో చెన్నై ల అన్నా యూనివర్శిటీ ఉంది. మొత్తం ఆసియా ర్యాంకింగ్స్ లో 111 ర్యాంక్ ను అన్నా యూనివర్సిటీ సాధించింది. దీని ఓవరాల్ స్కోర్ 52.3.
RANK | RESEARCH QUALITY | INDUSTRY | INTERNATIONAL OUTLOOK | RESEARCH ENVIRONMENT | TEACHING |
---|---|---|---|---|---|
111 | 80.0 | 65.8 | 20.2 | 34.1 | 43.3 |
3, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండోర్)
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండోర్) జాతీయ స్థాయిలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం ఆసియా ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఇండోర్ 131 పీజీ ర్యాంకింగ్ పొందింది. ఈ విద్యాసంస్థ స్కోర్ 49.4 గా ఉంది.
RANK | RESEARCH QUALITY | INDUSTRY | INTERNATIONAL OUTLOOK | RESEARCH ENVIRONMENT | TEACHING |
---|---|---|---|---|---|
131 | 70.8 | 35.5 | 35.0 | 32.8 | 52.2 |
మహాత్మాగాంధీ యూనివర్సిటీ
ఆసియా ర్యాంకింగ్స్ 2025లో చోటు దక్కించుకున్న ఉత్తమ భారతీయ విశ్వవిద్యాలయాల్లో మహాత్మాగాంధీ యూనివర్సిటీ నాలుగో స్థానంలో నిలిచింది. ఇది మొత్తం ఆసియాలో 140వ ర్యాంక్ లో నిలిచింది. దీని మొత్తం స్కోరు 48.6.
RANK | RESEARCH QUALITY | INDUSTRY | INTERNATIONAL OUTLOOK | RESEARCH ENVIRONMENT | TEACHING |
---|---|---|---|---|---|
140 | 57.8 | 34.5 | 28.0 | 45.0 | 53.5 |
5. షూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్
భారతీయ ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో హిమాచల్ ప్రదేశ్ లోని షూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఐదో స్థానంలో ఉంది. ఇది ఓవరాల్ ర్యాంకింగ్స్ లో 146 వ స్థానం సాధించింది. దీని స్కోర్ 48.1.
RANK | RESEARCH QUALITY | INDUSTRY | INTERNATIONAL OUTLOOK | RESEARCH ENVIRONMENT | TEACHING |
---|---|---|---|---|---|
146 | 81.5 | 22.6 | 71.4 | 25.8 | 35.7 |
6. సవీత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్
తమిళనాడులోని సవీత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ భారతీయ సంస్థల్లో ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్ ఆసియా ర్యాంకింగ్స్ లో 149 వ ర్యాంక్ సాధించింది. ఈ సంస్థకు 47.8 స్కోరు లభించింది.
RANK | RESEARCH QUALITY | INDUSTRY | INTERNATIONAL OUTLOOK | RESEARCH ENVIRONMENT | TEACHING |
---|---|---|---|---|---|
149 | 83.4 | 19.4 | 72.5 | 19.4 | 40.8 |
7. జామియా మిలియా ఇస్లామియా
చివరగా ఏడవ స్థానంలో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా ఉంది. ఈ సంస్థకు 161 వ ఓవరాల్ ర్యాంకింగ్, 46.9 స్కోర్ ఉంది.
RANK | RESEARCH QUALITY | INDUSTRY | INTERNATIONAL OUTLOOK | RESEARCH ENVIRONMENT | TEACHING |
---|---|---|---|---|---|
161 | 75.4 | 40.9 | 40.4 | 18.9 | 48.7 |
పూర్తి వివరాలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
Best Web Hosting Provider In India 2024
Source link