





Best Web Hosting Provider In India 2024

హారర్ థ్రిల్లర్‌గా కాళాంకి భైరవుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాజశేఖర్, జీవిత.. భయపెట్టేలా పోస్టర్
తెలుగులో సరికొత్తగా వస్తోన్న హారర్ థ్రిల్లర్ జోనర్ మూవీ కాళాంకి భైరవుడు. తాజాగా కాళాంకి భైరవుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సీనియర్ హీరో రాజేశేఖర్, ఆయన భార్య జీవిత రిలీజ్ చేశారు. ప్రస్తుతం భయపెట్టేలా ఉన్న కాళాంకి భైరవ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీరాముడింట శ్రీక్రిష్ణుడంట, నివాసి చిత్రాల తరువాత గాయత్రీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా “కాళాంకి బైరవుడు”. హారర్, థ్రిల్లర్ జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న కాళాంకి భైరవుడు సినిమాలో రాజశేఖర్ వర్మ, పూజ కిరణ్ హీరో, హీరొయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు హరి హరన్. వి కథ, దర్శకత్వం వహించారు.
పవర్ ఫుల్ లుక్‌లో కాళాంకి భైరవుడు పోస్టర్
కాళాంకి భైరవుడు సినిమాను కె.ఎన్. రావు, శ్రీనివాసరావు.ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ (ఏప్రిల్ 24) కాళాంకి భైరవుడు ఫస్ట్ లుక్‌ని సీనియర్ హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత ఇద్దరు కలిసి లాంచ్ చేశారు. ఇందులో హీరోని ఇంటెన్స్ లుక్‌లో చాలా పవర్ ఫుల్‌గా ప్రజెంట్ చేశారు. దీనికి సంబంధించిన కాళాంకి భైరవుడు ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది.
లాంతర్ వెలుగులో వెతుకుతున్న హీరో
రెండు పక్కల పుర్రెలు ఉండగా.. వాటి నడుమ నల్లటి రగ్గు కప్పుకుని హీరో లాంతర్ పట్టుకున్నాడు. ఆ లాంతర్ వెలుగులో దేనికోసమే వెతుకున్నట్లు కథానాయకుడు కనిపించాడు. అతనికి ఎదురుగా పొట్టేల్ బొమ్మ భయంకరంగా చూస్తూ ఉండటాన్ని పోస్టర్‌లో గమనించవచ్చు. ఈ పోస్టర్ ఇలా భయపెట్టేలా ఉంది.
తలకిందులుగా హీరో పోస్టర్
అలాగే, మరో పోస్టర్‌లో హీరోను తలకిందులుగా చూపించారు. మొహంపై రక్తపు మరకలతో తలకిందులుగా ఉన్న కథానాయకుడి పోస్టర్ ఇంటెన్సివ్‌గా అట్రాక్ట్ చేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో కాళాంకి భైరవుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాళాంకి భైరవుడు నటీనటులు
ఇదిలా ఉంటే, కాళాంకి భైరవుడు సినిమాలో రాజశేఖర్ వర్మ, పూజ కిరణ్‌లతోపాటు ఆమని, రితిక చక్రవర్తి, నాగ మహేష్, బలగం జయరాం, భవ్య, మహమద్ బాషా, బిల్లి మురళి ఇతర కీలక పాత్రలు పోషించారు. ”ఈ చిత్రం హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తీయడం జరిగింది. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ చిత్రం విడుదల చేయడం జరుగుతుంది” అని నిర్మాతలు ఈ సందర్భంగా తెలిపారు.
కాళాంకి భైరవుడు సాంకేతిక వర్గం
కాగా, కాళాంకి భైరవుడు సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలను అశోక్ అన్నెబోయిన చేపట్టగా.. సాయి కిశోర్ కే ఎడిటింగ్ పనులు చూసుకున్నారు. ఇక పెద్దపల్లి రోహిత్ కాళాంకి భైరవుడు సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీకి రామ్ సుంకర యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఆర్ట్ డైరెక్టర్‌గా బి జగన్, లైన్ ప్రొడ్యూసర్‌గా రామకృష్ణ ఆర్ వ్యవహరించారు.
సంబంధిత కథనం