





Best Web Hosting Provider In India 2024

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్: తెలుగులో నంబర్ వన్ సీరియల్ ఇదే.. కార్తీకదీపం మళ్లీ మూడో స్థానంలోనే..
స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈవారం నంబర్ వన్ సీరియల్ ర్యాంకు మరోసారి చేతులు మారింది. చాలా రోజులుగా టాప్ లో ఉన్న కార్తీకదీపం ఈసారి కూడా మూడో స్థానానికే పరిమితమైంది. అటు జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం.
తెలుగు టీవీ సీరియల్స్ లో నంబర్ వన్ ర్యాంకు మళ్లీ మారింది. 14వ వారం తొలిసారి కార్తీకదీపం సీరియల్ హవాకు చెక్ పెట్టగా.. ఇప్పుడు 15వ వారం కూడా ఆ సీరియల్ రెండో స్థానానికే పరిమితమైంది. తెలుగులో కొత్తగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అటు అర్బన్, ఇటు రూరల్ ప్రాంతాల్లో కలిపి నంబర్ వన్ గా నిలిచింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు రేటింగ్ ఇలా
స్టార్ మాలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గతేడాది నవంబర్ 12న మొదలైంది. వచ్చినప్పటి నుంచీ టాప్ 4లో ఉంటూ వస్తున్న ఈ సీరియల్.. తాజాగా 15వ వారం రేటింగ్స్ లో ఏకంగా నంబర్ వన్ గా నిలిచింది. అర్బన్, రూరల్ కలిపి ఈ సీరియల్ 10.84 రేటింగ్ సాధించింది. ఇక గత వారం టాప్ ర్యాంక్ కోల్పోయిన కార్తీకదీపం 2 సీరియల్.. ఈ వారం 10.68 రేటింగ్ తో మూడో స్థానంలోనే ఉంది.
గత వారం నంబర్ వన్ గా ఉన్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈసారి 10.80 రేటింగ్ తో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. తృటిలో టాప్ స్థానాన్ని కోల్పోయింది. ఇక నాలుగో స్థానంలో ఇంటింటి రామాయణం 9.92 రేటింగ్ తో నిలిచింది. ఐదో స్థానం మారిపోయింది. ఇన్నాళ్లూ ఈ ర్యాంకులో ఉన్న చిన్ని (7.77) ఆరో స్థానానికి పడిపోయింది. నువ్వుంటే నా జతగా సీరియల్ 7.86 రేటింగ్ తో ఐదో స్థానానికి చేరింది. బ్రహ్మముడి సీరియల్ 6.92 రేటింగ్ సాధించింది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. ఈ ఛానెల్ కు చెందిన ఏ సీరియల్ కూడా 7 రేటింగ్ టచ్ చేయలేకపోయింది. చామంతి సీరియల్ 6.66 రేటింగ్ తో టాప్ లో నిలిచింది. ఇక పడమటి సంధ్యారాగం సీరియల్ 6.52తో రెండో స్థానంలో ఉండగా.. జగద్ధాత్రి 6.43తో మూడో స్థానంలో ఉన్నాయి.
ఓవరాల్ గా టాప్ 10 తెలుగు సీరియల్స్ జాబితాలో ఈ మూడు సీరియల్సే జీ తెలుగు నుంచి ఉన్నాయి. అది కూడా 8, 9, 10 స్థానాల్లో కావడం గమనార్హం. మేఘ సందేశం సీరియల్ 6.33, అమ్మాయిగారు 5.22 రేటింగ్స్ సాధించాయి. లక్ష్మీ నివాసం సీరియల్ 4.85తో ఉంది.
తెలుగులో టాప్ 10 సీరియల్స్ ఇవే
తెలుగులో టాప్ 10 సీరియల్స్ లో మొత్తం స్టార్ మా, జీ తెలుగుకు చెందిన సీరియల్సే ఉన్నాయి. అందులోనూ టాప్ 7 మొత్తం స్టార్ మా కాగా.. చివరి మూడు స్థానాల్లో జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి. టాప్ 10 జాబితా ఒకసారి చూస్తే.. వరుసగా ఇల్లు ఇల్లాలు పిల్లలు, గుండె నిండా గుడి గంటలు, కార్తీకదీపం 2, ఇంటింటి రామాయణం, నువ్వుంటే నా జతగా, చిన్ని, బ్రహ్మముడి, చామంతి, పడమటి సంధ్యారాగం, జగద్ధాత్రి సీరియల్స్ ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్