




Best Web Hosting Provider In India 2024

ఏపీలో ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభం – అందుబాటులోకి ‘ఆచార్య యాప్’, ఇవిగో వివరాలు
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఉచిత ఆన్ లైన్ కోచింగ్ ను ప్రారంభించింది. ఆచార్య యాప్ తో సేవలను అందించనుంది. ఈ మేరకు మంత్రి సవిత… ఉచిత డీస్సీ కోచింగ్ ను ప్రారంభించారు.
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ… అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ను ప్రారంభించింది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులందరికీ ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ అందిచనున్నారు. ఈ సేవలను బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ….ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ద్వారా ఆచార్య యాప్ రూపొందించామని తెలిపారు. ఈ యాప్ ద్వారా 24 గంటల పాటు ఉచిత శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్ పై సీఎం చంద్రబాబు మొదట సంతకం చేశారన్నారు. డీఎస్సీ ద్వారా అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు బీసీ అభ్యర్థులే సాధించాలన్నది లక్ష్యంతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రారంభించామన్నారు. 26 జిల్లాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అందరూ అర్హులే…
ఆఫ్ లైన్ లో కోచింగ్ కు వెళ్లలేని గృహిణులు, సుదూర ప్రాంతవాసులతో పాటు ఇతరులకు లబ్ధి చేకూర్చేలా ఆన్ లైన్ కోచింగ్ ప్రారంభించినట్లు మంత్రి సవిత తెలిపారు. దరఖాస్తు చేసుకున్న బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులందరికీ ఉచిత కోచింగ్ అందజేస్తామన్నారు. ప్రస్తుతం 3,189 మంది దరఖాస్తులొచ్చాయన్నారు. ఇంకెంతమందైనా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆన్ లైన్ ద్వారా డీఎస్సీ ఉచిత కోచింగ్ అందజేస్తామన్నారు.
ఆచార్య యాప్ ద్వారా కోచింగ్
కాకినాడకు చెందిన శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ద్వారా ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఆచార్య పేరుతో యాప్ రూపొందించారన్నారు. ఈ యాప్ 24 గంటలూ పనిచేయడంతో పాటు అభ్యర్థులు… ఎన్ని పర్యాయాలైనా యాప్ ను ఓపెన్ చేసేలా రూపొందించామన్నారు.
ఈ యాప్ లో నిష్ణాతులైన అధ్యాపకుల బోధనలు, అన్ని సబ్జెక్టులకు చెందిన మెటీరియళ్లు, పాత డీఎస్సీ క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉంటాయన్నారు. యాప్ చార్ట్ బాక్స్ రూపొందించామని…. ఆ బాక్స్ లో సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు తెలిపితే తక్షణమే సిబ్బంది స్పందించిన సమాధానాలు తెలుపుతారన్నారు. టెక్నికల్ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రతి జిల్లాకు ఇద్దరిని నియమించినట్లు తెలిపారు. ఆ ఇద్దరితో వాట్సాప్ గ్రూప్ రూపొందించామని…. టెక్నికల్ సమస్యలు ఆ గ్రూప్ లో చెబితే వారు పరిష్కరిస్తారని మంత్రి సవిత వెల్లడించారు.
సంబంధిత కథనం
టాపిక్