



Best Web Hosting Provider In India 2024
భారత్ మరో కీలక నిర్ణయం.. పాకిస్థాన్ ప్రభుత్వ ఎక్స్ ఖాతా నిలిపివేత
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా పాక్ ప్రభుత్వ ఎక్స్ ఖాతాను నిలిపివేసింది భారత్.
పాకిస్థాన్‌పై భారత్ ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసింది. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కశ్మీర్‌లో పౌరులపై జరిగిన ఘోరమైన దాడి తర్వాత సీమాంతర ఉగ్రవాదానికి ఇస్లామాబాద్ మద్దతు ఇస్తోందని భారత్ పేర్కొంది. బుధవారం పాకిస్థాన్ పై దౌత్యపరమైన చర్యలు తీసుకున్న మరుసటి రోజే పాక్ ప్రభుత్వ ఎక్స్ ఖాతను కూడా భారత్ నిలిపివేసింది.
భారత్ కీలక నిర్ణయాలు
పహల్గామ్ సమీపంలోని బైసరన్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను హతమార్చిన మరుసటి రోజే కీలకమైన సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేయడం, కశ్మీర్‌లోని ప్రధాన భూ సరిహద్దు క్రాసింగ్‌ను మూసివేయడం సహా భారత్ ఈ చర్యలు తీసుకుంది. పాక్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) ఉగ్రదాడిని చాలా సీరియస్‌గా తీసుకుంది.
అట్టారిలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును తక్షణమే మూసివేయాలని సీసీఎస్ నిర్ణయించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం(ఎస్వీఈఎస్) కింద పాకిస్థాన్ పౌరులు భారత్‌కు రావడానికి అనుమతించబడరని, పాకిస్తాన్ పౌరులకు గతంలో జారీ చేసిన వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. ఇస్లామాబాద్‌లోని భారత్ దౌత్యవేత్తతోపాటు ఆ కార్యాలయంలోని భారత సిబ్బంది సైతం పాకిస్థాన్‌ను వీడి స్వదేశానికి రావాలని చెప్పింది.
పాక్ దౌత్తవేత్తకు సమన్లు
మరోవైపు దిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్‌ను పిలిపించి నోటీసు అందజేసింది. దీని ప్రకారం వారు వారం రోజుల్లో భారత్‌ను వీడాల్సి ఉంటుంది. పాక్‌కు పనిచేసే త్రివిధ దళాల్లోలనివారు కూడా వెళ్లాలి. ఇంకోవైపు పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీ గురువారం సమావేశం అవుతుంది. దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన భేటీ జరుగుతుంది. భారత్ తీసుకున్న నిర్ణయాలపై ఇందులో చర్చిస్తారు.
Best Web Hosting Provider In India 2024
Source link