బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్: కావ్యకు చెమటలు పట్టించిన రుద్రాణి-తిప్పికొట్టిన కళావతి- రామ్‌తో రొమాన్స్- సుభాష్ వార్నింగ్

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్: కావ్యకు చెమటలు పట్టించిన రుద్రాణి-తిప్పికొట్టిన కళావతి- రామ్‌తో రొమాన్స్- సుభాష్ వార్నింగ్

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి ఏప్రిల్ 25 ఎపిసోడ్‌లో రాజ్ సంతకం కావ్య ఫోర్జరీ చేసిందని ఇంట్లో గొడవ చేస్తుంది రుద్రాణి. ఫోర్జరీ చెక్ చేసే వ్యక్తిని పిలిపించి చెక్ చేయిస్తుంది. కాఫీ షాప్‌లో రామ్‌తో కావ్య రొమాంటిక్ సీన్ నడుస్తుంది. రుద్రాణి ప్లాన్ ఫెయిల్ కావడంతో ప్రతిసారి భరిచం అని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు.

బ్రహ్మముడి సీరియల్‌ ఏప్రిల్ 25వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యపై పవర్ ఆఫ్ అటార్నీ రావడంపై ఇంట్లో అంతా షాక్ అవుతారు. కావ్య ఫోర్జరీ చేసిందని రుద్రాణి గొడవ చేస్తుంది. నీకంటే ముందు డాక్యుమెంట్స్ నా చేతికి ముందు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోతున్నావా. డాక్యుమెంట్స్ నవ్య జూలర్స్ వాళ్లకు పంపావ్. వాళ్లు బ్యాలెన్స్ క్లియర్ చేశారు. దాంతో కంపెనీ పేరు మీద ఉన్న డ్యూస్ అన్ని క్లియర్ చేశావ్. ఇంటి పరువు కాపాడావ్. బాగుంది సూపర్ అని రుద్రాణి అంటుంది.

కావ్యను నిలదీసిన రుద్రాణి

కానీ, రాజ్ చేయాల్సింది అంతా నువ్ చేశావ్. కానీ, రాజ్ లేకుండా నీ చేతికి పవర్ ఆఫ్ అటార్నీ ఎలా వచ్చింది అని నిలదీస్తుంది రుద్రాణి. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ వచ్చిన దుగ్గిరాల కుటుంబం అని డైలాగ్స్ కొడుతుంది. ఆ పేపర్స్ ఎలా వచ్చాయని ఇందిరాదేవి, సీతారామయ్య అడుగుతారు. కంపెనీ ఎండీ లేకుండా వేరొకరి పేరు మీదకు రాయలేరు కదమ్మా. ఎలా చేయగలిగావ్ అని సీతారామయ్య అంటాడు.

ఒరిజినల్ కాదనుకుందామంటే అధికారం కోసం నమ్మిన సిద్ధాంతాలను పక్కన పెట్టవని మాకు తెలుసు అని సుభాష్ అంటాడు. నా గురించి ఇంత బాగా తెలిసిన మీరు రుద్రాణి మాటలు విని ఇదేంటీ అని నన్ను ఎలా అడగాలానిపిస్తుందని కావ్య అంటుంది. రుద్రాణి సాక్ష్యాలాతో అడుగుతుంది. తనకేం సమాధాం చెప్పమంటావ్ అని ఇందిరాదేవి అంటుంది.

రుద్రాణి గారు ప్రశ్నిస్తున్నందుకు నాకు బాధగా లేదు. ఆవిడకు నేను చెప్పాల్సిన సమాధానం మీరు ఎదురు చూస్తున్నారనేది నాకు బాధగా ఉంది. ఎవ్వరు ఏం అడిగినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాదే కాబట్టి చెబుతున్నా. మీ అబ్బాయి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడో నా పేరు మీద ఈ పవర్ ఆఫ్ అటార్నీ సిద్ధం చేసి ఉంచారు అని కావ్య చెబుతుంది.

ఫ్లాన్ ఫెయిల్

దాంతో అంతా షాక్ అవుతారు. రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అయినట్లు అవాక్కైపోతుంది. ఏయ్ పచ్చి అబద్దం. ఇదంతా నేను నమ్మను అని రుద్రాణి వాదిస్తుంది. ఎండీ లేకుండా ఇంకొకరిపైకి పవర్ ఆఫ్ అటార్ని ఇవ్వడానికి ఏ టెక్నాలజీ రాలేదు. కాదని నువ్వు ఏం చేసిన అది ఫ్రాడే అవుతుంది. రేపు ఎవరైనా కంప్లైట్ చేస్తే నువ్ జైలుకు వెళ్తావ్. కానీ, మా కుటుంబ గౌరవం ఏం కావాలి. అలాంటిదేమైనా జరిగితే పరువుతోపాటు మావాళ్ల ప్రాణాలు కూడా పోతాయి అని రుద్రాణి అంటుంది.

చాల్లే ఆపు. అలాంటివి నువ్ చేస్తావుగానీ, కావ్య చేయదు అని సపోర్ట్ చేస్తుంది అపర్ణ. రేపు క్లైంట్స్‌కు కోర్టుకు వెళ్తే మనమీద పరువు నష్టం దావా వేస్తారు. ఇది నిజంగా రాజ్ సంతకమా. రాజ్ లాగా కావ్య చేసిన ఫోర్జరీ సంతకమా అని తెలియాలి. దానికే పద్ధతి ఉంటుంది అని చెప్పిన రుద్రాణి కాల్ చేసి ఒకరిని లోపలికి రమ్మంటుంది. రుద్రాణి ముందస్తు ప్లాన్‌ను చూసి అంతా షాక్ అవుతారు.

కావ్య డాక్యుమెంట్స్, రాజ్ బతికి ఉన్నప్పుడు ఉన్నపుడు సంతకం చేసిన డాక్యుమెంట్స్ రెండింటిని చూసి అది ఫోర్జరీనా కాదా కనుక్కోండని అతనికి ఇస్తుంది రుద్రాణి. ఏం కావ్య హాల్లో సెంట్రల్ ఏసీ ఉన్న నీకు చెమటలు పడుతున్నాయి. సంతకాలు ఎవరు చేశారో తెలియని అప్పుడు నీకు పట్టిస్తా అసలైన చెమటలు అని రుద్రాణి అంటుంది. అది ఫోర్జరీ అని చెప్పండి అని అతనితో అంటుంది రుద్రాణి.

ఉలిక్కిపడిన రుద్రాణి

ఇవి రెండు ఒరిజినల్ సంతకాలే మేడమ్ అని చెక్ చేసిన అతను చెబుతాడు. దాంతో తన ప్లాన్‌ను కావ్య తిప్పికొట్టిందని రుద్రాణి ఉలిక్కిపడుతుంది. రెండింట్లోనూ ఒక్కరే సంతకం చేశారు అని కన్ఫర్మ్ చేస్తాడు. దాంతో కావ్య జరిగింది గుర్తు చేసుకుంటుంది. కాఫీ షాప్‌లో రాజ్ వెళ్లినట్లే వెళ్లి వచ్చి సమస్యల్లో ఉంటే వెళ్లడం కరెక్ట్ కాదనిపించిందని అంటాడు. మనవాళ్ల కోసం తప్పు చేయడం తప్పు కాదనిపించింది. మీరు అడిగినట్లుగానే సంతకం చేయాలనిపిస్తుంది అని రాజ్ అంటాడు.

అవునా.. ఇది మా బాస్ పెట్టిన సంతకం దీన్ని చూసి ఇక్కడ పెట్టండి అని కావ్య చెబుతుంది. రామ్ ఒక్కసారి చూసి రాజ్‌లాగా సంతకం చేసేస్తాడు. అది చూసి కావ్య ఆశ్చర్యపోతుంది. మీరు గతం మర్చిపోయినా సంతకం మర్చిపోలేదు అని అంటుంది. అది విన్న రామ్ ఏంటీ అని అడుగుతాడు. ఒక్కసారి చూడగానే ఇంత పర్ఫెక్ట్‌గా చేశారు అని చెబుతుంది కావ్య. మీరు హ్యాపీగా ఇలా ఫోర్జరీ సంతకాలు చేస్తూ బతికేయొచ్చు అని కావ్య అంటుంది.

ఊరుకోండి. ఒక్కసారి ఇలా చేయగానే నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో చూడండి అని తన గుండెలపై కావ్య చేయి వేసుకుంటాడు.దాంతో ఇద్దరు అలా చూసుకుంటారు. ఇది రొమాంటిక్‌గా ఉంటుంది. తగ్గిపోతుంది లెండి అని కావ్య చెబుతుంది. కట్ చేస్తే దుగ్గిరాల ఇంట్లో ఫోర్జరీ కనిపెట్టే వ్యక్తికి కావాలంటే ఇంకా డబ్బులు ఇస్తాను, టైమ్ కావాల చెప్పండి. కరెక్ట్ చెప్పండి అని రుద్రాణి కంగారుగా అంటుంది.

20 ఏళ్లుగా చేస్తున్నాను

నేను క్లియర్‌గా చూశాను మేడమ్. ఇది ఒరిజినల్ సంతకమే అని అతను అంటాడు. అసలు నీకు పని తెలుసా అని రుద్రాణి కోప్పడుతుంది. నేను ఈ వర్క్ 20 ఏళ్లుగా చేస్తున్నా. రెండు నిమిషాల్లో చెప్పగలను. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్లండి. ఈ రెండు సంతకాలు ఒక్కరే చేశారని చెబుతారు అని అతను వెళ్లిపోతాడు. దాంతో అంతా రుద్రాణిని చూస్తారు.

అనుమానం వచ్చింది. చెక్ చేశాను. తప్పేముందు అని రుద్రాణి అంటుంది. తప్పా. తప్పున్నర, నీకన్న చిన్నది బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని ఈ కుటుంబం, కంపెనీ కోసం కష్టపడుతున్నదానిపై అనుమానం ఎలా వచ్చిందే అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. ధాన్యలక్ష్మీతో సహా ఇంట్లో అందరూ రుద్రాణికి చివాట్లు పెడతారు. జీవితాంతం ఇలాగే భరిస్తామని అనుకోకు అని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు.

సాక్ష్యాలన్ని మమ్మీకి ఫేవర్‌గా ఉన్నాయనుకునేలోపు ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు. ఒక్కసారి కూడా మా మమ్మీని గెలవనివ్వరా అని రాహుల్ మనసులో అనుకుంటాడు. ఈ సంతకాలు రాజ్ పెట్టినప్పుడు పొద్దున జ్యూలర్స్ వాళ్లు డబ్బుల గురించి అడుగుతున్నప్పుడు ఎందుకు నోరు మెదపలేదు. దీని గురించి దాచి ఏం సాధిద్దావ్ అనుకున్నావ్ అని రుద్రాణి ఇరకాటంలో పెడుతుంది.

దొరికిన తర్వాత

ఇవి నాకు ఆరు నెలల క్రితం ఆయన ఇచ్చారు. ఆఫీస్‌లో పెట్టారు. ఇప్పుడు అవి ఉన్నాయో లేదో తెలియకుండా వాళ్లకు ఎలా చెప్పగలను. ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ లేకపోతే వాళ్లకు అబద్ధం చెప్పినదాన్ని అవుతాను. దాంతో నమ్మకం పోతుంది. అందుకే విషయం చెప్పకుండా ఆఫీస్‌కు వెళ్లి డాక్యుమెంట్స్ దొరికాక కాల్ చేసి చెప్పాను. ఇందులో తప్పేంటీ అని కావ్య రివర్స్‌లో అడుగుతుంది.

ఇక నిన్ను తిట్టడానికి మా దగ్గర మాటలు కూడా లేవే.. ఛీ ఛీ.. ఒక మనిషి మీద ఇంత ద్వేషం పెంచుకోవడమా అని ఇందిరాదేవి వెళ్లిపోతుంది. పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడం అంటే ఇదే అని స్వప్న సెటైర్లు వేస్తుంది. రాజ్ ముందు జాగ్రత్తగా ఆలోచించాడు కాబట్టి ఈరోజు ఇలా కంపెనీని కాపాడాడు అని సుభాష్ అంటాడు. ముందు జాగ్రత్త కాదు ఆయనకు గతం గుర్తుకు వస్తుంది. అందుకే ఇలా సంతకం పెట్టగలిగారు అని కావ్య అనుకుంటుంది.

మరోవైపు కావ్య ఇచ్చిన అడ్రస్ పొడుపు కథ గురించి ఆలోచిస్తుంటాడు రాజ్. గూగుల్‌లో సెర్చ్ చేస్తాడు. వజ్రాల కొండ అంటే మణికొండ, నీటి ద్వారం అంటే పైప్‌లైన్. ముక్కంటి అంటే ఏంటీ అని రాజ్ ఆలోచిస్తూ చిరాకు పడతాడు. తర్వాత కాసేపటికి తెలిసిందిలే.. తెలిసిందిలే.. దీనర్థం తెలిసిందిలే అని రాజ్ అనుకుని కావ్యకు కాల్ చేస్తాడు. అది చూసి ఇలా అర్ధరాత్రి కాల్ చేశారేంటీ. అర్థం కాలేదేమో. చెప్పేద్దాం అని కావ్య అనుకుంటుంది.

దుగ్గిరాల ఇంటికి రామ్

రాజ్ ఓ అడ్రస్ చెబుతాడు. కానీ, అదెక్కడ ఉందని అనుకున్న కావ్య.. అవునండి కరెక్టే అని చెబుతుంది. కట్ చేస్తే దుగ్గిరాల ఇంటికి రామ్ వెళ్తాడు. ఇంటికొస్తున్న రాజ్‌ను చూసి కావ్య ఉలిక్కిపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024