





Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు ఈ రోజు ఎపిసోడ్: మీనా మెడలో మూడుముళ్లు వేసిన బాలు -కుళ్లుకున్న ప్రభావతి -మనోజ్ పరువు గోవిందా
గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 25 ఎపిసోడ్‌లో మీనా కోసం బంగారం కొంటాడు బాలు. ఆ బంగారాన్ని అందరికి చూపిస్తాడు. నా భార్యకు నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని గర్వంగా చెబుతాడు. బాలు కొన్న బంగారం చూసి జెలసీగా ఫీలవుతుంది ప్రభావతి.
సంజు కారు రిపేర్ కావడంతో అతడితో పాటు మౌనికను తన కారులో వాళ్ల ఇంటి దగ్గర దింపుతాడు బాలు. కిరాయి డబ్బులను బాలుపై విసిరేసి వెళ్లబోతాడు సంజు. అతడిని బాలు ఆపేస్తాడు. ఆ డబ్బును తీసి కళ్లకు అద్దుకొని తనకు ఇవ్వకపోతే నీ మనుషుల ముందే నిన్ను కొడతానని సంజుకు వార్నింగ్ ఇస్తాడు. బాలు వార్నింగ్‌కు భయపడి అతడు చెప్పినట్లే చేస్తాడు సంజు.
మౌనిక అబద్ధం…
నాకోసం ఎందుకు సంజు ముందు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావని బాలుతో మౌనిక అంటుంది. అన్నయ్యను కదా…నీ కోసం తప్పదని బాలు సమాధానమిస్తాడు. సంజు లేకపోవడంతో ఇప్పటికైనా నిజం చెప్పమని, ఈ గాయం సంజు వల్లే అయ్యింది కదా అని మౌనికను అడుగుతాడు బాలు. కానీ మరోసారి అబద్ధం చెబుతుంది మౌనిక. సంజు తనను బాగా చూసుకుంటున్నాడని అంటుంది.
నా కోసం నిజం చెప్పు…
నాతో పాటు అమ్మనాన్నలు బాధపడుతున్నారని నువ్వు అబద్ధం చెబుతున్నావ్ కదా….నా కోసం నిజం చెప్పమని మౌనికను పట్టుపడతాడు బాలు. సంజు తనను బాగానే చూసుకుంటున్నాడని అంటుంది. ఇదే మాట నా మీద ఒట్టేసి చెప్పమని బాలు అంటాడు. నా మీద నమ్మకం లేదా…నేను నీకు అబద్ధం చెబుతానా అని మౌనిక కోపంగా బాలు తలపై నుంచి చేయితీసేస్తుంది. . ఈ గాయం గురించి ఇంట్లో చెప్పొద్దని, అమ్మనాన్న బాధపడతారని అంటుంది.
సంజు భయం…
మౌనిక ఎక్కడ నిజం చెబుతుందో అని సంజు కంగారు పడతాడు. భయంతో మౌనికను తెలివిగా అక్కడి నుంచి పంపిచేస్తాడు. మౌనిక నిజమే చెబుతుంది, సంజుకు తనపైనే కోపమని, మౌనికనే ప్రేమగానే చూసుకుంటున్నాడని బాలు అనుకుంటాడు.
క్షమాపణలు చెప్పిన మనోజ్…
మనోజ్ రెస్టారెంట్‌లో సప్లయర్ డ్యూటీ చేయకుండా ఫోన్ చూస్తూ టైమ్ పాస్ చేస్తుంటాడు. టెన్త్ చదువుకున్న వాళ్లతో జాబ్ చేయాల్సివచ్చిందని బాధపడుతున్నట్లుగా బిల్డప్‌లు ఇస్తాడు. మనోజ్ రెస్టారెంట్‌కు చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తి వస్తాడు. ఆర్డర్ తీసుకోవడానికి అతడి దగ్గరకు మనోజ్ వస్తాడు. నువ్వు రోజు పార్కులో వచ్చి పడుకునేవాడివి కదా అని మనోజ్‌ను అతడు గుర్తుపడతాడు.
నాకు అసిస్టెంట్‌గా రమ్మంటే రాకుండా…ఇప్పుడు సప్లయర్‌గా జాబ్ చేస్తున్నావా…ఎక్కడ జాబ్ రాలేదా అని మనోజ్‌ను అవమానిస్తాడు ఆ చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి. అతడి మాటలు భరించలేక కాలర్ పట్టుకుంటాడు మనోజ్. ఓనర్ వచ్చి మనోజ్‌కు క్లాస్ ఇస్తాడు. చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి మనోజ్ చేత సారీ చెప్పిస్తాడు.
ఇతడిని పనిలో ఎలా పెట్టుకున్నారు…మొన్నటివరకు మా ఏరియా పార్కులో పడుకునేవాడని, ఇతడిని నమ్ముకుంటే మీ వ్యాపారం మునిగిపోతుందని మనోజ్ పరువు మొత్తం తీసేస్తాడు చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తి.
మనోజ్ కంగారు…
అప్పుడే మనోజ్‌కు రోహిణి ఫోన్ చేస్తుంది. పని ఒక్కటే కాదని, మీ ఆఫీస్ పక్కనే ఏదైనా హోటల్ ఉంటే వెళ్లి తినమని అంటుంది. హోటల్ పేరు వినగానే తాను రోహిణికి దొరికిపోయానని మనోజ్ కంగారు పడతాడు.
నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను.
బాలు ఇంటికొస్తాడు. రాగానే ప్రభావతి కనిపించకపోవడంతో అమ్మ పుట్టింటికి వెళ్లిపోయిందా ఇళ్లు ఇంత ప్రశాంతంగా ఉందని బాలు పంచ్‌లు వేస్తాడు. నాకు అంత అదృష్టం లేదని సత్యం బదులిస్తాడు. ఇంట్లో అందరిని పిలుస్తాడు బాలు. నా భార్యను పుట్టింటి నుంచి బంగారం తేలేదని అమ్మ దారుణంగా అవమానించింది. నా భర్త బంగారం కొన్నరోజే మెడలో వేసుకుంటానని మీనా శపథం చేసింది. నా భార్యకు నామీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. మీనా కోసం బంగారు తెచ్చానని తాను కొన్న పుస్తెలు చూపిస్తాడు.
మీనా సంబరం…
బాలు కొన్న పుస్తెలు చూడగానే మీనా సంబరపడుతుంది. ప్రభావతి షాకవుతుంది. నువ్వు సూపర్ అన్నయ్య అని బాలును పొగుడుతాడు రవి. వదిన దృష్టిలో నువ్వు హీరో అని చెబుతాడు. మనోజ్, రోహిణి మాత్రం జెలసీగా ఫీలవుతారు.
మంచి పనిచేశావని, మీనా మాట నిలబెట్టవాలని బాలును చూసి గర్వపడతాడు సత్యం. ఎవరో కారు తోలేవాడు బంగారం కొనలేడు అని ఎగతాళి చేశారు వారికి సమాధానం ఇది అని ప్రభావతిపై సెటైర్లు వేస్తాడు బాలు.
తక్కువ చేసి మాట్లాడొద్దు…
అందరి ముందు ఎప్పుడు నా భర్తను తక్కువ చేసి మాట్లాడేవారు. ఇవాళ కూడా ఆయన జన్మలో బంగారం కొనలేరని అన్నారు. పంతానికి పోతే ఇవాలే కొంటారని నేను అన్నాను. అన్న మాట నిలబెట్టుకున్నారని భర్త గొప్పతనం గురించి ప్రభావతికి వివరిస్తుంది మీనా. ఇక నుంచి మీ కొడుకునే మీరే తక్కువ చేసి మాట్లాడొద్దు అని చెబుతాడు.
ప్రభావతి ఓవరాక్షన్…
కారు తోలేవారు కాపురాలు చేసుకుంటున్నారు. ఇళ్లు కొంటున్నారు. పౌరుషం వచ్చినరోజు భార్యకు బంగారం కూడా కొంటున్నారని మీనా అంటుంది. శభాష్ ముళ్లకంప అని బాలును మెచ్చుకుంటుంది.మీనా థాంక్యూ పూలగంప అని బాలు బదులిస్తాడు. బోడి తులం కూడా లేని బంగారం కొని ఏదో నగల షాప్ కొన్నట్లు బిల్డప్‌లు ఇస్తున్నారు. ఆపండి మీ ఓవరాక్షన్ అని ప్రభావతి అంటుంది. ఇంతసేపు మీరు చేసిందే ఓవరాక్షన్‌లా ఉందని శృతి…అత్తపై సెటైర్ వేస్తుంది.
మీనా కన్నీళ్లు…
ప్రభావతి అన్న మాటలు, తనకు జరిగిన అవమానం, సత్యం పొగడ్తలు గుర్తుచేసుకొని మీనా ఎమోషనల్ అవుతుంది. బాలును కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అందరి ముందు నా పరువు నిలబెట్టారని అంటుంది. నీ మొహంలో సంతోషం చూడాలని ఈ పనిచేశానని, ఇలా కన్నీళ్లు చూడాలని కాదని బాలు అంటాడు. ఇవి కన్నీళ్లు కాదని, ఎక్కువ ఆనందం అని మీనా చెబుతుంది. అందరి ముందు వేసుకుంటే దర్జాగా ఉండేదని బాలు చెబుతాడు.
డబ్బు మర్చిపోయాడు…
పుస్తెలు కొనే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని బాలును అడుగుతుంది మీనా. పొద్దున్నే తన కారు ఎక్కిన ఓ కస్టమర్ లగేజీతో పాటు డబ్బు కూడా మర్చిపోయాడని, ఆ డబ్బుతో ఈ పుస్తెలు కొన్నానని బాలు అంటాడు. పరాయి వాళ్ల డబ్బుతో కొన్నానని అంటే నేను కాదు మీ అమ్మ కూడా నమ్మదు. పరాయి వాళ్ల సొమ్ముకు ఆశపడరు. నిజంగానే మీకు దొరికితే వెతికి మరి వాళ్లకు ఇచ్చేవారని, మా ఆయన బంగారం అని మీనా అంటుంది. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ అని, అది కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెబుతుంది.
రోహిణి అబద్ధం…
రోహిణికి వాయిస్ మెసేజ్ చేస్తాడు వర్ధన్. ఏంటి కళ్యాణి…ఈ నెల నా మామూలు పంపలేదు. నా జాబ్ పోగొట్టి నువ్వు జల్సాగా బతుకుతుంటే నాకు ఎంతో మంటగా ఉంటుంది. డబ్బులు పంపకపోతే ఈ సారి వాయిస్ మెసేజ్ మీ అత్తకు వెళుతుందని అంటాడు. అప్పుడే ప్రభావతి లోపలికి అడుగుతుంది.
ఎవరు ఫోన్‌లో అని అంటుంది. మలేషియా మావయ్య అని అబద్ధం ఆడుతుంది రోహిణి. మలేషియా మావయ్యతో మాట్లాడుతానని, ఆయన భార్యకు ఎలా ఉందో కనుక్కుంటానని ప్రభావతి చెబుతుంది. ఇప్పుడు ఫోన్ మాట్లాడటానికి వీలుకాదట, బిజీగా ఉండటంతోనే వాయిస్ మెసేజ్ పంపించాడని రోహిణి అబద్ధం చెబుతుంది.
పూల కొట్టు డబ్బులు…
బాలుకు బంగారం కొనేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందని రోహిణితో అంటుంది ప్రభావతి. మీనా పూల షాప్‌లో ఎప్పుడు చూసిన కస్టమర్స్ చాలా మంది ఉంటున్నారని, బాలు పరువు నిలబెట్టాలని పూల మీద సంపాదించిన డబ్బే ఇచ్చి ఉంటుందని రోహిణి అంటుంది. పూల కొట్టు నుంచి ఇంట్లోకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ప్రభావతి దెప్పొపొడుస్తుంది.
మీనా మెడలో బాలు మూడు ముళ్లు…
మూడు గ్రాముల బంగారం కొని మీనా అంత పొగరు చూపిస్తుంటే…అన్ని నగలు ఉండి నువ్వు ఎందుకు వేసుకోవని రోహిణిని అడుగుతుంది ప్రభావతి. అత్త మాటలతో రోహిణి కంగారు పడతుంది.
బాలును తీసుకొని గుడికి వస్తుంది మీనా. ఇష్టం లేకుండా మన పెళ్లి జరిగింది. కానీ ఇప్పుడు జీవితాంతం కలిసి బతకాలనే కోరిక బలపడింది. ఇప్పుడు నా మెడలో మూడుముళ్లు వేయండి. తలవంచుకొని తాళి కట్టించుకుంటానని అంటుంది. బాలు మీనా పెళ్లి మరోసారి గుడిలో జరుగుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం