





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 74 కోట్ల సూపర్ హిట్ కామెడీ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. 6.1 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి ఇవాళ సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ మ్యాడ్ స్క్వేర్ వచ్చేసింది. సంతోష్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ 74 కోట్లు కలెక్ట్ చేసింది. మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్కు నేడు వచ్చేసింది. మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ వివరాలు చూస్తే..!
ఓటీటీలోకి ప్రతివారం ఎన్నో సరికొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే, వీటిలో ఎక్కువగా శుక్రవారం ఓటీటీ రిలీజెస్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు స్పెషల్ సినిమాలు ఉంటాయి. అలా ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన సినిమాల్లో స్పెషల్‌గా సూపర్ హిట్ కామెడీ మూవీ ఒకటి ఉంది.
2023లో వచ్చిన మూవీకి సీక్వెల్
అదే మ్యాడ్ స్క్వేర్. 2023లో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ హిట్ కొట్టిన సినిమా మ్యాడ్. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ముగ్గురు హీరోలుగా నటించిన మ్యాడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
విపరీతమైన క్రేజ్
దాంతో మ్యాడ్ సీక్వెల్‌పై విపరీతమైన అంచనాలు పెరిగాయి. మ్యాడ్ సీక్వెల్ కోసం ఎంతగానే ప్రేక్షకులు ఎదురుచూశారు. ఇక వారి కోరిక మేరకు అన్నట్లుగానే మ్యాడ్ స్క్వేర్ అని రెండో భాగాన్ని ప్రకటించారు. అప్పటినుంచి మ్యాడ్ స్క్వేర్‌పై విపరీతమైన క్రేజ్ నెలకొంది.
పెరిగిన అంచనాలు
అంతేకాకుండా మ్యాడ్ స్క్వేర్ నుంచి రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. కల్యాణ్ శంకర్ కథ, దర్శకత్వం వహించిన మ్యాడ్ స్క్వేర్ మూవీ మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే, మొదటి పార్ట్ ఆకట్టుకున్నంతగా రెండో భాగానికి రెస్పాన్స్ రాలేదు.
కామెడీ బాగుందని
పెద్దగా కథ లేకపోవడం, కొన్ని సీన్స్ చాలా వరకు రొటీన్‌గా ఉన్నాయనే టాక్ వచ్చింది. కానీ, కామెడీ మాత్రం చాలా బాగుందని చెప్పారు. ముగ్గురు హీరోలు చేసే అల్లరి, కామెడీ టైమింగ్, డైలాగ్స్ ఆకట్టుకుంటాయని రివ్యూలో పేర్కొన్నారు.
మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్
అయితే, కేవలం ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా మ్యాడ్ స్క్వేర్ సినిమాకు రూ. 74 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. మొత్తానికి బాక్సాఫీస్ సూపర్ హిట్‌గా మ్యాడ్ స్క్వేర్ సినిమా నిలిచింది. ఇలాంటి మ్యాడ్ స్క్వేర్ ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 25) వచ్చేసింది.
మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్
నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ వంటి ఐదు భాషల్లో ఇవాళ మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ అయింది. మరి మ్యాడ్ స్క్వేర్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.
మ్యాడ్ స్క్వేర్ కథ
ఇదిలా ఉంటే, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై మ్యాడ్ స్క్వేర్ సినిమాను సూర్యదేవర నాగ వంశీ సమర్పించారు. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య మ్యాడ్ స్క్వేర్ సినిమాను నిర్మించారు.
ఇక ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.1 రేటింగ్ సాధించిన మ్యాడ్ స్క్వేర్ కథ విషయానికొస్తే.. నలుగురు ఫ్రెండ్స్ గోవా వెళ్లి ఏం చేశారన్నదే మ్యాడ్ స్క్వేర్ మూవీ.
సంబంధిత కథనం