లిప్‌లాక్‌లు ఎక్కువే – ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు బోల్డ్ మూవీ – ఏడాదిన్న‌ర త‌ర్వాత మ‌రో ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌

Best Web Hosting Provider In India 2024

లిప్‌లాక్‌లు ఎక్కువే – ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు బోల్డ్ మూవీ – ఏడాదిన్న‌ర త‌ర్వాత మ‌రో ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌

Nelki Naresh HT Telugu

యాంక‌ర్ సుమ క‌న‌కాల త‌న‌యుడు రోష‌న్ క‌న‌కాల హీరోగా న‌టించిన బ‌బుల్‌గ‌మ్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాదిన్న‌ర త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న‌ ఈ మూవీ తాజాగా గురువారం అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైంది. ఈ బోల్డ్ మూవీలో మాన‌స చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది.

బ‌బుల్‌గ‌మ్ మూవీ

యాంక‌ర్ సుమ క‌న‌కాల త‌న‌యుడు రోష‌న్ క‌న‌కాల హీరోగా న‌టించిన బ‌బుల్‌గ‌మ్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాదిన్న‌ర త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఆహా ఓటీటీలోనూ బ‌బుట్ గ‌మ్ మూవీ అందుబాటులో ఉంది. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో కేవ‌లం తెలుగు వెర్ష‌న్ మాత్ర‌మే స్ట్రీమింగ్ అవుతోంది.

మాన‌స చౌద‌రి హీరోయిన్‌…

యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన బ‌బుల్‌గ‌మ్ మూవీతో మాన‌స చౌద‌రి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. క్ష‌ణం ఫేమ్ ర‌వికాంత్ పేరేపు ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాతోనే రోష‌న్ క‌న‌కాల హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్ష‌ణం సినిమాకు భిన్నంగా లిప్‌లాక్స్‌, రొమాంటిక్ అంశాల‌కు ప్రాముఖ్య‌మిస్తూ బోల్డ్ కంటెంట్‌తో ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ పేరేపు ఈ మూవీని తెర‌కెక్కించాడు.

మూడు కోట్ల క‌లెక్ష‌న్స్‌…

దాదాపు ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ మూడు కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. తెలుగులో విజ‌య‌వంత‌మైన డీజే టిల్లు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ఛాయ‌లు క‌నిపించ‌డం మైన‌స్‌గా మారింది. రొటీన్ స్టోరీ కావ‌డం కూడా మైన‌స్‌గా మారింది.

బ‌బుల్‌గ‌మ్ క‌థ ఇదే…

ఆదిత్య అలియాస్ ఆది (రోష‌న్ క‌న‌కాల‌) మిడిల్ క్లాస్ కుర్రాడు. డీజేగా కావాల‌ని ఆది క‌ల‌లు కంటుంటాడు. ఓ డీజే వ‌ద్ద అసిస్టెంట్‌గా జాయిన్ ఆయిన ఆదికి జాన్వీ ప‌రిచ‌యం అవుతుంది.

తొలిచూపులోనే జాన్వీతో ఆది ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెకు ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తాడు. ఫారిన్ వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్న జాన్వీ ఆ లోపు ఆదితో ల‌వ్ పేరుతో టైమ్‌పాస్ చేయాల‌ని అనుకుంటుంది. కానీ ఆది ఆటిట్యూడ్ చూసి అత‌డిని ఇష్ట‌ప‌డుతుంది.

జాన్వీ బ‌ర్త్ డే రోజు జ‌రిగిన ఆదికి ఆమె ఫ్రెండ్ లిప్‌లాక్ ఇస్తుంది. ఆదిని అపార్థం చేసుకున్న జాన్వీ పార్టీలోనే అత‌డి బ‌ట్ట‌లు విప్పించి దారుణంగా అవ‌మానిస్తుంది.జాన్వీపై ఆది ప్ర‌తీకారం తీర్చుకున్నాడా? జాన్వీ ప్రేమ‌కు ఆది ఎలాంటి ప‌రీక్ష పెట్టాడు? ఆ ప‌రీక్ష‌లో జాన్వీ నెగ్గిందా? ఆది, జాన్వీ ఒక్క‌ట‌య్యారా? లేదా? అన్న‌దే బ‌బుల్ గ‌మ్ క‌థ‌.

సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ బ్ర‌ద‌ర్‌…

బ‌బుల్ గ‌మ్ మూవీలో హీరో తండ్రి సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ సోద‌రుడు చైతూ జొన్న‌ల‌గ‌డ్డ న‌టించాడు. ఈ మూవీకి శ్రీచ‌ర‌ణ్ పాకాల మ్యూజిక్ అందించాడు.

మోగ్లీ మూవీ…

బ‌బుల్‌గ‌మ్ త‌ర్వాత ఏడాదికిపైగా గ్యాప్ ఇచ్చిన రోష‌న్ క‌న‌కాల మోగ్లీ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమాకు క‌ల‌ర్ ఫొటో ఫేమ్ సందీప్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ‌త ఏడాది రిలీజైన మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్‌సిరీస్‌లో ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో రోష‌న్ క‌న‌కాల క‌నిపించాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024