





Best Web Hosting Provider In India 2024

నాలుగైదు రోజుల్లో తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు…ఇప్పటికే పూర్తైన జవాబు పత్రాల మూల్యంకనం
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు మరో నాలుగైదు రోజుల్లో విడుదల కానున్నాయి. ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణలో కూడా ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
తెలంగాణలో నాలుగైదు రోజుల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు సెకండరీ బోర్డ్ ఏర్పాట్లు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో ఫలితాలను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం తెలంగాణ ప్రభుత్వానికి ఫైల్ పంపింది. ముఖ్యమంత్రి అమోదం లభించిన తర్వాత పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి.
తెలంగాణలో ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల మార్కుల మెమోలపై కొంత సందిగ్ధం నెలకొంది. గ్రేడింగ్ విధానంపై స్పష్టత కొరవడటంతో ఫలితాలు ఆలస్యమైనట్టు ప్రచారం జరిగింది. పాస్ సర్టిఫికెట్లపై మార్కులను ముద్రించే విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. మెమోలపై మార్కులు ముద్రించడంపై స్పష్టత కోసం కొంత ఆలస్యమైంది. తాజాగా జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడం, ఏపీలో ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణలో కూడా పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణలో ఏప్రిల్ 2వ తేదీతో పరీక్షలు ముగియగా, ఏప్రిల్ 7వ తేదీ నుంచే స్పాట్ వాల్యూయేషన్ మొదలైంది. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. విద్యార్థుల జవాబు పత్రాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి వాల్యూయేషన్ చేశారు. మూల్యాంకనం పూర్తికావడంతో కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక అంశాలను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మెమోలపై సష్టత రాగానే ఫలితాల వెల్లడి తేదీని ప్రకటిస్తారు.
టెన్త్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
తెలంగాణ పదో తరగతి ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చేసుకోవచ్చు. హోం పేజీలో కనిపించే పదో తరగతి ఫలితాలు 2025 లింక్ పై నొక్కాలి. ఇక్కడ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.
హెచ్టి తెలుగులో పదో తరగతి ఫలితాలు
ఈసారి కూడా తెలంగాణ పదో తరగతి ఫలితాలు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సింగిల్ క్లిక్ తో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. హోంపేజీలో కనిపించే తెలంగాణ పదో తరగతి ఫలితాల లింక్ లో విద్యార్థి రూల్ నెంబర్, రేపు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
గతేడాది విడుదలైన తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 89.41 శాతం, బాలికలు 92 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూళ్లలో 100 శాతం ఫలితాలు వచ్చాయి. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో ఫలితాలు వచ్చాయి. 99.06శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 66 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
సంబంధిత కథనం
టాపిక్