రీ రిలీజ్‌లో కుమ్మేసిన ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌చిన్ – ఇది ఓ డిజాస్ట‌ర్ తెలుగు మూవీకి రీమేక్ – ఇక్క‌డ ఫ‌ట్…అక్క‌డ హిట్‌

Best Web Hosting Provider In India 2024

రీ రిలీజ్‌లో కుమ్మేసిన ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌చిన్ – ఇది ఓ డిజాస్ట‌ర్ తెలుగు మూవీకి రీమేక్ – ఇక్క‌డ ఫ‌ట్…అక్క‌డ హిట్‌

Nelki Naresh HT Telugu

ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌చిన్ మూవీ రీ రిలీజ్‌లోనూ రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. గిల్లి త‌ర్వాత హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సౌత్ ఇండియ‌న్ రీ రిలీజ్ మూవీగా స‌చిన్ రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో డిజాస్ట‌ర్‌గా నిలిచిన నీతో సినిమాకు రీమేక్‌గా స‌చిన్ తెర‌కెక్క‌డం గ‌మ‌నార్హం.

ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌చిన్

ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌చిన్ మూవీ రీ రిలీజ్‌లో రికార్డ్ క‌లెక్ష‌న్స్‌తో కుమ్మేస్తోంది. త‌మిళ‌నాడు బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా ఎనిమిది కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రీ రిలీజ్ మూవీస్‌లో గిల్లి త‌ర్వాత అత‌డిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సౌత్ ఇండియ‌న్ మూవీగా స‌చిన్ నిలిచింది.

మూడు రోజుల్లో ఆరు కోట్లు…

ఏప్రిల్ 18న థియేట‌ర్ల‌లో రీ రిలీజైన స‌చిన్ మూవీ తొలిరోజు ఏకంగా 2.2 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. రెండో రోజు ఈ మూవీకి కోటి తొంభై ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్లు వ‌చ్చాయి. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే ఆరు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మొత్తంగా గురువారం నాటికి ఈ మూవీకి 8.20 కోట్ల క‌లెక్ష‌న్స్‌ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఈ వీకెండ్ లోగా ప‌ది కోట్ల మార్క్‌ను ఈ మూవీ ట‌చ్ చేస్తుంద‌ని అంటున్నారు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ గిల్లి మూవీ రీ రిలీజ్‌లో ఏకంగా 30 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న రీ రిలీజ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. గిల్లి త‌ర్వాత సెకండ్ ప్లేస్‌లో స‌చిన్ నిలిచింది.

బిపాసా బ‌సు టాలీవుడ్ ఎంట్రీ…

స‌చిన్ మూవీకి జాన్ మ‌హేంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2005లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్ గ్లామ‌ర్ బ్యూటీ బిపాసా బ‌సు స‌చిన్ మూవీతోనే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ అప్ప‌ట్లోనే ప‌ది కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ది. స‌చిన్ మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించ‌డం గ‌మ‌నార్హం.

తెలుగు రీమేక్‌…

స‌చిన్ మూవీ ఓ తెలుగు సినిమాకు రీమేక్ కావ‌డం గ‌మ‌నార్హం. కే రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి హీరోగా న‌టించిన నీతో మూవీ ఆధారంగా స‌చిన్ తెర‌కెక్కింది. నీతో మూవీతోనే ప్ర‌కాష్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

స‌చిన్ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జాన్ మ‌హేంద్ర‌న్‌… నీతో సినిమాకు కూడా డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. నీతో క‌థ‌లో కొన్ని మార్పులు చేస్తూ స‌చిన్ పేరుతో త‌మిళంలోకి రీమేక్ చేశాడు. తెలుగులో డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ త‌మిళంలో మాత్రం ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

జ‌న‌నాయ‌గ‌న్‌…

ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ సినిమా చేస్తోన్నాడు. ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీకి హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇదే విజ‌య్ చివ‌రి సినిమా అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌న‌నాయ‌గ‌న్ త‌ర్వాత విజ‌య్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. జ‌న‌నాయ‌గ‌న్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024