ప్రైమ్ వీడియోలోకి ఇవాళ వచ్చిన ఈ మూవీ చూశారా.. సినిమాపై పిచ్చి ప్రేమ ఉంటే ఇది కచ్చితంగా చూడండి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

ప్రైమ్ వీడియోలోకి ఇవాళ వచ్చిన ఈ మూవీ చూశారా.. సినిమాపై పిచ్చి ప్రేమ ఉంటే ఇది కచ్చితంగా చూడండి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu

ప్రైమ్ వీడియోలోకి శుక్రవారం (ఏప్రిల్ 25) స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ సినిమా పిచ్చోళ్ల కోసమే. సినిమా అంటే పిచ్చి ప్రేమ ఉన్న వాళ్లు ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. మహారాష్ట్రలోని ఓ చిన్న టౌన్ కు చెందిన కొందరు కుర్రాళ్లు తీసే సినిమాల కథ ఇది.

ప్రైమ్ వీడియోలోకి ఇవాళ వచ్చిన ఈ మూవీ చూశారా.. సినిమాపై పిచ్చి ప్రేమ ఉంటే ఇది కచ్చితంగా చూడండి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మన చుట్టూ ఎంతో మంది సినిమా పిచ్చోళ్లు ఉంటారు. ఏ సినిమా వచ్చిన వదలకుండా చూడటమే వాళ్ల పని. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటి సినిమా పిచ్చోళ్ల చుట్టూ తిరిగేదే. కానీ వీళ్లు ఎక్కడో ముంబైకి పరిమితమైన సినిమాను ఓ మారమూలన ఉండే తమ ఊరికి తీసుకొచ్చే వాళ్ల కథ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మిస్ కావద్దు.

సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ ఓటీటీ స్ట్రీమింగ్

మనం చెప్పుకుంటున్న ఆ సినిమా పేరు సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ (Superboys of Malegaon). ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజైంది. ఇదొక రియల్ స్టోరీ. మహారాష్ట్రలోని మాలేగావ్ అనే ఓ చిన్న టౌన్ లోని కొందరు యువకులు.. సినిమాపై ఉండే పిచ్చి ప్రేమతో తమ ఊళ్లోనే సినిమాలు తీస్తూ తమ కలలను సాకారం చేసుకుంటారు.

అలాంటి వాళ్ల కథకు సినిమా రూపమే ఇది. ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 25) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్నాళ్ల కిందటే రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కు రాగా.. ఇప్పుడు సబ్‌స్క్రైబర్లందరికీ ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది.

సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ స్టోరీ ఏంటంటే?

మహారాష్ట్రలోని మాలేగావ్ అనే ఓ చిన్న టౌన్. అక్కడ చిన్న వీడియో పార్లర్ నడుపుకునే నాసిర్ అనే యువకుడు.. ఎప్పటికైనా పెద్ద ఫిల్మ్ మేకర్ కావాలని కలలు కంటుంటాడు. తన వీడియో పార్లర్లోని మినీ థియేటర్ కోసం తానే సినిమాలు తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అతనికి వస్తుంది. అదే మాలేగావ్ లో ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీసే తన ఫ్రెండ్స్ తో ఈ ఆలోచన పంచుకుంటాడు. దానికి వాళ్లు కూడా సరే అంటారు.

ఆ స్నేహితుల నుంచే రైటర్, కెమెరా మ్యాన్, నటీనటులు అందరూ సిద్ధమవుతారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ షోలేకి పేరడీ తీద్దామని నిర్ణయించుకుంటారు. ఎలాగో కిందామీదా పడి సినిమా తీస్తారు. అది కాస్తా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మాలేగావ్ ప్రజలు తమ మధ్యలోనే ఉన్న తమ సినిమా పిచ్చోళ్లకు బ్రహ్మరథం పడతారు. దీంతో అలాంటి పేరడీ సినిమాలు క్యూ కడతాయి. ఈ క్రమంలో నాసిర్ అనే ఆ యువ దర్శకుడు, అతని స్నేహితులకు ఎదరయ్యే సవాళ్లేంటి? వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

ఈ సూపర్‌బాయ్స్.. ఓ రియల్ స్టోరీ

సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ ఓ రియల్ స్టోరీ. ఆ ఊళ్లోని నాసిర్ అనే యువకుడు డైరెక్టర్ గా మారి తన స్నేహితులతోనే సినిమాలు తీసి ఎలా ఎదిగాడో కళ్లకు కట్టే సినిమా ఈ సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్. 1997లో మొదలయ్యే ఈ కథ 2010 వరకు సాగుతుంది.

ఇందులో నాసిర్ పాత్రలో ఆదర్శ్ గౌరవ్ నటించాడు. ఈ సినిమాకు అతని నటనే హైలైట్ అని చెప్పొచ్చు. అతనితోపాటు వినీత్ కుమార్ సింగ్, శశాంక్ అరోరా, రిద్ధీ కుమార్, ముస్కాన్ జాఫ్రీలాంటి వాళ్లు నటించారు. రీమా కంగ్టి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా.. వరుణ్ గ్రోవర్ కథ అందించాడు. 2012లో సూపర్‌మెన్ ఆఫ్ మాలేగావ్ పేరుతో వచ్చిన డాక్యుమెంటరీ ఆధారంగా ఈ సినిమా తీశారు.

మన మధ్య కూడా ఎంతో మంది సినిమా పిచ్చోళ్లు ఉంటారు. ఆ రంగుల ప్రపంచంలోకి వెళ్లాలని ఆశ పడుతుంటారు. ఎక్కడికో వెళ్లి ఎవరో ఇచ్చే అవకాశాల కోసం ఎదురు చూడకుండా తమకు తామే అవకాశాలు క్రియేట్ చేసుకొని ఆ సినిమానే తమ ఊరికి రప్పించే ఈ సూపర్‌ బాయ్స్ స్టోరీ సినిమా మీద పిచ్చి ప్రేమ ఉన్న ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024