




Best Web Hosting Provider In India 2024

ఫెమినిస్ట్‌లుగా చెప్పుకునే హీరోలపై హీరోయిన్ మాళవిక మోహనన్ సంచలన కామెంట్స్.. ముసుగు వేసుకుని తిరుగుతారంటూ కౌంటర్స్!
ఫెమినిస్టులమని చెప్పుకునే హీరోలు, మేల్ యాక్టర్స్‌పై ప్రభాస్ ది రాజా సాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్ సంచలన కామెంట్స్ చేసింది. ఫెమినిస్టులుగా చెప్పుకునే నటులు ముసుగు వేసుకుంటారని, వారి ప్రవర్తన, ఆలోచన నిజమైన ఫెమినిజానికి విరుద్ధంగా ఉంటుందని మాళవిక చెప్పుకొచ్చింది. దీంతో మాళవిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యాళం నుంచి వచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్. అయితే, తన షాకింగ్ కామెంట్స్‌తో ఈ మధ్య బాగా వైరల్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్‌గానే దక్షిణాది సినిమాల్లో హీరోయిన్స్ నాభిని చూపించడానికి మేకర్స్ చాలా ఇష్టపడతారని, జూమ్ చేసి మరి ఫొటోలు చూస్తారని సంచలన కామెంట్స్ చేసింది మాళవిక మోహనన్.
పురుషాధిక్యత పాతుకుపోయింది
తాజాగా మరోసారి అలాంటి సంచలన కామెంట్స్ చేసింది ఈ మలయాళ బ్యూటి. ఈసారి ఫెమినిజంపై తన అభిప్రాయాలు చెప్పిన మాళవిక మోహనన్ చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత పాతుకుపోయిందని దుయ్యబట్టింది. ఇక ఫెమినిస్టులమని నటించే మేల్ యాక్టర్స్, హీరోలను విమర్శిస్తూ, వారు ముసుగు వేసుకుని ఎలా తిరుగుతారో తనకు తెలుసని కౌంటర్స్ వేసింది.
ఎప్పుడు అంతం కాదు
రీసెంట్‌గా హాటర్‌ఫ్లైకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫెమినిజంపై తన అభిప్రాయాలను పంచుకుంది మాళవిక మోహనన్. ఈ ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. “చిత్ర పరిశ్రమలో ఈ అసమానత (పురుషాధిక్యత) ఎప్పుడూ అంతం కాదని నేను అనుకుంటున్నాను” అని చెప్పింది.
తెలివిగా వ్యవహరిస్తున్నారు
“హీరోలు, మేల్ యాక్టర్స్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. గత 5-6 సంవత్సరాలలో చాలా మంది నటులలో ఇది నేను చూశాను. వారు ఎలా నటించాలి. ఈ విషయం (ఫేమినిజం లేదా క్యాస్టింగ్ కౌచ్) వచ్చినప్పుడు ఎలా మేల్కొనాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ముసుగు వేసుకోవాలో వారికి తెలుసు” అని మాళవిక మోహనన్ తెలిపింది.
ఎలాంటి మాటలు చెప్పాలో
మాళవిక ఇంకా మాట్లాడుతూ, “స్త్రీలను సమానంగా చూసే వ్యక్తిగా, చాలా ముందుచూపు ఉన్న వ్యక్తిగా, ఫెమినిస్ట్‌గా కనిపించేలా ఏయే మాటలు చెప్పాలో వారికి తెలుసు. అలాగే, వారు ఎవరు లేనప్పుడు ఎప్పటిలాగే స్త్రీ ద్వేషపూరితంగా ఉంటారో నేను చూశాను” అని చెప్పుకొచ్చింది. అయితే, అలా ఫెమినిస్టులుగా నటించే హీరోలు, యాక్టర్స్ పేరు మాత్రం మాళవిక మోహనన్ చెప్పలేదు.
ప్రభాస్ సినిమాలో
కానీ, మాళవిక మోహనన్ కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, మాళవిక మోహన్ గతేడాది తమిళ చిత్రం తంగలాన్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ప్రస్తుతం హిందీ మూవీ యుద్రలో యాక్ట్ చేస్తోంది. అలాగే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన తెలుగు సినిమా ది రాజా సాబ్‌లో హీరోయిన్‌గా స్క్రీన్ పంచుకోనుంది.
సంజయ్ దత్ అతిథి పాత్ర?
ది రాజా సాబ్ సినిమాలో మాళవికతోపాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడని పుకార్లు వస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అలాగే, మాళవిక తమిళ హీరో కార్తీతో సర్దార్ 2 కూడా చేస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్