




Best Web Hosting Provider In India 2024

ఏపీ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులా..? ఈ నెంబర్లను సంప్రదించండి
ఏపీ మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మే 15వ తేదీతో ఈ గడువు ముగియనుంది. అయితే దరఖాస్తుల ప్రక్రియలో పలు ఇబ్బందులు వస్తున్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేలా విద్యాశాఖ… ప్రత్యేక హెల్ప్ నెంబర్లను అందుబాటులోకి వస్తుంది.
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 15వ తేదీతో పూర్తవుతుంది. అయితే దరఖాస్తుల ప్రక్రియలో పలు ఇబ్బందులు ఉంటున్నాయని చెబుతున్నారు.
ముఖ్యంగా డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురువుతున్నాయని అభ్యర్థులు ప్రస్తావిస్తున్నారు. రిక్రూట్ మెంట్ ప్రక్రియలో ఈసారి కొన్ని మార్పులు తీసుకురావటంతో…. ఈ సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అర్హతల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. కొన్నిసార్లు సెలెక్ట్ ఆప్షన్లు కూడా సరిగా తీసుకోవటం లేదని అంటున్నారు.
వెబ్ సైట్ లో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. డిపార్ట్ మెంట్ల వారీగా ఈ నెంబర్లను ప్రకటించింది. అంతేకాకుండా విద్యాశాఖ నుంచి ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను తీసుకువచ్చింది. మెయిల్ ద్వారా సమస్యలను తెలపవచ్చని సూచించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి…
శాఖల వారీగా ఫోన్ నెంబర్లు:
- ఏపీ మోడల్ స్కూల్ – 7893931292
- జువైనల్ వెల్ఫేర్ – 9866735794
- APSWREIS – 8978222529
- బీసీ వెల్ఫైర్ రెసిడెన్షియల్ స్కూల్స్ – 9549348275
- ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం – 9398185126
- ట్రైబల్ వెల్ఫేర్ (ఆశ్రం) – 9494141670
- ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూన్ – 8712625082
- దివ్యాంగుల సంక్షేమం – 7893971877
ఇక విద్యాశాఖ తరపున 6281704160, 8121947387, 8125046997, 9398810958 7995649286, 7995789286, 9963069286, 7013837359 హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెంబర్లకు కాల్ చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఫోన్ నెంబర్ల ద్వారానే కాకుండా dscgrievances@apschooledu.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
ఇక ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల మే 30వ తేదీన విడుదలవుతాయి. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభమై…. జూలై 6తో ముగుస్తాయి. పరీక్షలు పూర్తయిన రెండు రోజు ప్రాథమిక కీలను విడుదల చేస్తారు. ప్రాథమిక కీల విడుదల తర్వాత 7 రోజులు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ప్రకటిస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
సంబంధిత కథనం
టాపిక్