ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ కన్నుమూత; ప్రధాని మోదీ సంతాప సందేశం

Best Web Hosting Provider In India 2024


ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ కన్నుమూత; ప్రధాని మోదీ సంతాప సందేశం

Sudarshan V HT Telugu

ఇస్రో మాజీ చీఫ్, భారత జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ కె.కస్తూరి రంగన్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు.

ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్

ఇస్రో మాజీ చీఫ్, జాతీయ విద్యా విధానం (NEP) ముసాయిదా కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ కె.కస్తూరి రంగన్ శుక్రవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు.

ప్రధాని మోదీ సంతాపం

కస్తూరి రంగన్ మృతిపై భారత ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారత దేశ శాస్త్రీయ, విద్యా ప్రయాణంలో ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ కె.కస్తూరి రంగన్ మహోన్నత వ్యక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కస్తూరి రంగన్ నాయకత్వం ప్రతిష్టాత్మక ఉపగ్రహ ప్రయోగాలను కూడా చూసిందని, ఆవిష్కరణలపై దృష్టి సారించిందని ప్రధాని మోదీ అన్నారు.

ఇస్రో చీఫ్ గా..

డాక్టర్ కస్తూరి రంగన్ ఇస్రో చీఫ్ గా, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తగా, దార్శనిక విద్యా సంస్కర్తగా విశేష సేవలను అందించారు. డాక్టర్ కస్తూరి రంగన్ భారతదేశ అంతరిక్ష కార్యక్రమం, భారత నూతన విద్యా విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ‘‘బెంగళూరులోని తన నివాసంలో ఈ ఉదయం ఆయన స్వర్గస్తులయ్యారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం, వారు నివాళులర్పించడం కోసం ఆయన పార్థివదేహాన్ని రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఆర్ఐ)లో ఏప్రిల్ 27న ఉంచుతారు’’ అని అధికారులను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది.

జేఎన్ యూ వీసీగా..

ఎన్ఈపీలో పేర్కొన్న విద్యా సంస్కరణల వెనుక ఉన్న వ్యక్తిగా కస్తూరి రంగన్ పేరుగాంచారు. అలాగే, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. భారత ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. కస్తూరి రంగన్ ఏప్రిల్ 2004 నుండి 2009 వరకు బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీస్ కు డైరెక్టర్ గా కూడా పనిచేశారు.

ఈ ఉపగ్రహాల వెనుక ఆయనే..

భారతదేశం ప్రయోగించిన మొదటి రెండు ప్రయోగాత్మక భూ పరిశీలన ఉపగ్రహాలైన భాస్కర-1 & భాస్కర 2 లకు కస్తూరి రంగన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ తరువాత ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, ఐఆర్ఎస్ -1ఎ ప్రయోగానికి నేతృత్వం వహించారు. డాక్టర్ కస్తూరి రంగన్ బొంబాయి విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆనర్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలను పొందారు. అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో పనిచేస్తూ 1971 లో ప్రయోగాత్మక హై ఎనర్జీ ఆస్ట్రానమీలో డాక్టరేట్ డిగ్రీని పొందారు.

పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ విజయంలో..

ఇస్రో ఛైర్మన్ గా కస్తూరి రంగన్ ఉన్న సమయంలోనే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం విజయవంతమైంది. ఆయన హయాంలో ఇస్రో అనేక ప్రధాన మైలురాళ్లను. ఇటీవల, ముఖ్యమైన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ) మొదటి ప్రయోగ పరీక్ష కూడా విజయవంతమైంది.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link