మీ పిల్లలకు డ్యాన్స్ అంటే ఇష్టమా.. అయితే ఈ హాలీడేస్‌లో ఓటీటీలో డ్యాన్స్‌పై వచ్చిన ఈ 10 సినిమాలు కచ్చితంగా చూపించండి

Best Web Hosting Provider In India 2024

మీ పిల్లలకు డ్యాన్స్ అంటే ఇష్టమా.. అయితే ఈ హాలీడేస్‌లో ఓటీటీలో డ్యాన్స్‌పై వచ్చిన ఈ 10 సినిమాలు కచ్చితంగా చూపించండి

Hari Prasad S HT Telugu

డ్యాన్స్ అంటే ఇష్టపడే పిల్లలకు చూపించడానికి ఓటీటీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. ఈ సమ్మర్ హాలిడేస్ లో వాటిని చూపిస్తే వాళ్లకు టైంపాస్ అవుతుంది అదే సమయంలో ఆ సినిమాల నుంచి స్ఫూర్తి కూడా పొందుతారు.

మీ పిల్లలకు డ్యాన్స్ అంటే ఇష్టమా.. అయితే ఈ హాలీడేస్‌లో ఓటీటీలో డ్యాన్స్‌పై వచ్చిన ఈ 10 సినిమాలు కచ్చితంగా చూపించండి

ఓటీటీలో ఎంత చూసిన తరగనంత కంటెంట్ ఉంటోంది. అందులో జానర్ కు అనుగుణంగా కూడా సినిమాలు ఉన్నాయి. వీటిలో డ్యాన్స్ ఆధారంగా తీసిన మూవీస్ కూడా ఉంటాయి. ఈ మూవీస్ మీ పిల్లలకు డ్యాన్స్ పై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతాయనడంలో సందేహం లేదు. మరి ఆ సినిమాలేంటి? ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయో చూడండి.

స్టైల్ – ప్రైమ్ వీడియో

తెలుగులో 2006లో వచ్చిన మూవీ స్టైల్. లారెన్స్ రాఘవ నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమా డ్యాన్స్ పై ఉన్న గౌరవాన్ని, ఆసక్తిని పెంచుతుంది. ఈ మూవీలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుగాంచిన ప్రభుదేవా కూడా నటించారు. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ చూడొచ్చు.

2. బీ హ్యాపీ – ప్రైమ్ వీడియో

బీ హ్యాపీ ఈ మధ్యే ప్రైమ్ వీడియోలోకి వచ్చిన మూవీ. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్లో నటించిన మూవీ. డ్యాన్సే జీవితంగా భావించే ఓ చిన్నారి, ఆమె కలలను నెరవేర్చడానికి ఎంత వరకైనా వెళ్లే తండ్రి చుట్టూ తిరిగే సినిమా ఇది. మంచి ఎమోషనల్ మూవీ.

3. ఏబీసీడీ: ఎనీబడీ కెన్ డ్యాన్స్ – నెట్‌ఫ్లిక్స్

ఏబీసీడీ 2013లో వచ్చిన మూవీ. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా డైరెక్ట్ చేశాడు. ప్రభుదేవా, గణేష్ ఆచార్యలాంటి కొరియోగ్రాఫర్లతోపాటు కేకే మేనన్ నటించిన మూవీ ఇది. కొందరు స్ట్రీట్ డ్యాన్సర్లతో ఓ వ్యక్తి చేసే అద్భుతం చుట్టూ తిరిగే మూవీ ఇది. 2015లో ఏబీసీడీ 2 పేరుతో సీక్వెల్ కూడా వచ్చింది. అది కూడా చూడొచ్చు.

4. లక్ష్మి – జీ5 ఓటీటీ

లక్ష్మి 2018లో వచ్చిన తమిళ మూవీ. తెలుగులోనూ జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్ లాంటి వాళ్లు నటించారు. తల్లికి ఇష్టం లేకపోయినా డ్యాన్స్ మీద ఉన్న మక్కువతో ఓ చిన్నారి ఏం చేసిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

5. సాగర సంగమం – ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్

క్లాసికల్ డ్యాన్స్ పై వచ్చిన సినిమాలంటే అందులో మొదటగా చెప్పుకోవాల్సింది ఈ సాగర సంగమం గురించే. 1983లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ ఇది. విశ్వనాథ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించిన సినిమా ఇది. ఈ మూవీని ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.

6. స్వర్ణకమలం – ఆహా, ప్రైమ్ వీడియో

విశ్వనాథ్ డైరెక్షన్ లోనే వచ్చిన మరో క్లాసిక్ మూవీ స్వర్ణకమలం. 1988లో వచ్చింది. వెంకటేశ్, భానుప్రియ నటించిన ఈ సినిమా కూడా డ్యాన్స్ చుట్టూనే తిరుగుతుంది. తన తండ్రి నేర్పే సాంప్రదాయ కూచిపూడి డ్యాన్స్ ను అసహ్యించుకునే ఓ అమ్మాయిని మనసు మార్చి, ఆమెను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఓ యువకుడి కథే ఈ మూవీ. ఆహా వీడియో, ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

7. మయూరి – సన్ నెక్ట్స్ ఓటీటీ

మయూరి కూడా ఓ స్ఫూర్తిదాయకమైన సినిమా. 1985లో వచ్చింది. సుధా చంద్రన్ అనే భరతనాట్యం డ్యాన్సర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. డ్యాన్స్ అంటే ప్రాణమిచ్చే అమ్మాయి ప్రమాదంలో ఓ కాలు కోల్పోయినా.. తర్వాత కృత్రిమ కాలుతోనూ ఆ డ్యాన్స్ ను కొనసాగించే ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.

8. పౌర్ణమి – ప్రైమ్ వీడియో

పౌర్ణమి మూవీ 2006లో వచ్చింది. ప్రభాస్, ఛార్మీ, త్రిష నటించిన ఈ సినిమా కూడా డ్యాన్స్ ప్రధానంగా సాగే సినిమానే. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

9. నాట్యం – ప్రైమ్ వీడియో, ఆహా వీడియో

నాట్యం 2021లో వచ్చిన తెలుగు మూవీ. ఇది సాంప్రదాయ, ఆధునిక డ్యాన్స్ ఫార్మ్స్ చుట్టూ తిరిగే కథ. ఈ మూవీ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉంది.

10. ఆజా నచ్‌లే – ప్రైమ్ వీడియో

బాలీవుడ్ లో మాధురి దీక్షిత్ కమ్ బ్యాక్ మూవీ ఇది. ఓ డ్యాన్స్ థియేటర్ ను కాపాడుకునే కొరియోగ్రాఫర్ పాత్రలో ఆమె నటించింది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024