





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ డైరెక్ట్ వచ్చేసిన హారర్ థ్రిల్లర్- ఇంటి కోడళ్లను బలి కోరే శాపం- 2 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ నేరుగా హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ అయ్యన మనే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా రెండు భాషల్లో నేడు అయ్యన మనే ఓటీటీ రిలీజ్ అయింది. కోడళ్లను బలికోరే ఓ ఇంటి శాపంగా ఈ హారర్ సిరీస్ సాగనుంది. తెలుగు హీరోయిన్ ఖుషి రవి నటించిన అయ్యన మనే ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేద్దాం.
ఓటీటీలో వచ్చే హారర్ థ్రిల్లర్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు సరికొత్త కథా కథనాలతో హారర్ థ్రిల్లర్స్ వస్తాయా అని ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ వారంలో చాలా స్పెషల్‌గా ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ నేరుగా ఇవాళ (ఏప్రిల్ 25) ఓటీటీలోకి వచ్చేసింది.
వివిధ అంశాలతో హారర్ థ్రిల్లర్
నేడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన హారర్ సస్పెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయ్యన మనే. కన్నడ భాషలో హారర్, సస్సెన్స్, మిస్టరీ, క్రైమ్ అంశాలతో అయ్యన మనే తెరకెక్కింది. ఈ సిరీస్‌లో మెయిన్ లీడ్ రోల్‌లో తెలుగు హీరోయిన్ ఖుషి రవి నటించింది. పిండం, ఊరు పేరు భైరవ కోన, దియా వంటి సినిమాల్లో నటించిన ఖుషి రవి అయ్యన మనేలో ప్రధాన పాత్ర పోషించింది.
శ్రుతి నాయుడు క్రియేటర్‌గా వ్యవహరించిన అయ్యన మనే సిరీస్‌కు రమేష్ ఇందిరా దర్శకత్వం వహించారు. ఖుషి రవితోపాటు మానసి సుధీర్, హిత చంద్రశేఖర్, అర్చన కొట్టిగే, రమేష్ ఇందిరా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ కోడళ్లను బలి కోరే ఓ ఇంటి శాపం చుట్టూ నడుస్తుంది.
అయ్యన మనే ఓటీటీ రిలీజ్
మంచి మిస్టరీ, హారర్ అంశాలతో తెరకెక్కిన అయ్యన మనే ఓటీటీలో ఇవాళ్టీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో అయ్యన మనే ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా కన్నడ, హిందీ వంటి రెండు భాషల్లో అయ్యన మనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది జీ5 ఓటీటీ వారి తొలి కన్నడ ఒరిజినల్ వెబ్ సిరీస్ కావడం విశేషం.
అయ్యన మనే సిరీస్ మొత్తంగా 6 ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఒక్కో ఎపిసోడ్ సుమారుగా 18 నిమిషాలకుపైగా రన్ టైమ్‌తో ఉంది. ఇక అయ్యన మనే కథ విషయానికొస్తే.. జాజి అనే యువతి పెళ్లి చేసుకుని తన భర్త ఇంటికి కోడలిగా వస్తుంది. ఆ భవనం తమ పూర్వీకులది. తరతరాలుగా తమ కుటుంబసభ్యులు నివసిస్తూ ఉంటారు.
వింత శబ్ధాలు, ఆత్మహత్యలు
అయితే, కొత్తగా కోడలిగా వచ్చిన (జాజి ఖుషి రవి)కి ఆ ఇంట్లో విచిత్రమైన సంఘటనలు ఎదరవుతుంటాయి. ఇంటి పక్కన ఉన్న బావి నుంచి వింత శబ్ధాలు, అర్ధరాత్రి పూట నట్టింట్లో ఉరి వేసుకున్న ఓ యువతి కనిపించండం వంటి జరుగుతాయి. ఆ ఇంట్లోని కోడళ్లు మాత్రం ఒక్కొక్కరుగా చస్తారు అని, అది ఆ ఇంటికి ఉన్న శాపం అని జాజి తెలుసుకుంటుంది.
అలాగే, ఎంతో అమాయకుడు అనుకున్న భర్తలో మరో కోణం కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? కోడళ్లు అందరు పలు విధాలుగా ఎందుకు చనిపోతున్నారు? అసలు ఆ ఇంటి శాపం ఏంటీ? ఆ ఇంటి పూర్వీకుల రహస్యం ఏంటీ? అది జాజి తెలుసుకుందా? శాపం నుంచి జాజి బయటపడగలిగిందా? అనే విషయాలు తెలియాలంటే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న అయ్యన మనే సిరీస్‌ను చూడాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్