





Best Web Hosting Provider In India 2024

ఒకే రోజు రెండు ఓటీటీలలోకి వచ్చిన మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ – విలన్ ఎవరన్నది గెస్ చేయడం కష్టమే!
అర్జున్ సర్జా హీరోగా నటించిన మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ విరున్ను ఒకే రోజు రెండు ఓటీటీలలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు మనోరమా మ్యాక్స్ ఓటీటీలలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మలయాళం మూవీలో నిక్కీ గల్రానీ హీరోయిన్‌గా నటించింది.
సీనియర్ హీరో అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ విరున్ను ఓటీటీలోకి వచ్చింది. ఒకే రోజు రెండు ఓటీటీలలో ఈ మూవీ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు మనోరమా మ్యాక్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం.
బైలింగ్వల్ మూవీ…
విరున్ను మూవీలో నిక్కీ గల్రానీ, సోనా నాయర్ కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ డ్రామా మూవీకి కన్నన్‌తామరకులం దర్శఖత్వం వహించాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో బైలింగ్వల్ మూవీగా విరున్ను తెరకెక్కింది. తమిళంలో విరుంధు పేరుతో ఈ మూవీ రిలీజైంది. కొన్ని ట్విస్ట్‌లను దర్శకుడు బాగానే రాసుకున్నా ఆశించిన స్థాయిలో ఈ మూవీ మాత్రం విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
విరున్ను కథ ఇదే…
జాన్ కథాలి అనే బిజినెస్‌మెన్‌తో పాటు అతడి భార్య ఎలిజబెత్ అనుమానాస్పద రీతిలో హత్యకు గురువతారు. ఈ మర్డర్ కేసును ఛేదించే బాధ్యతను దేవ్ నారాయణన్ అనే పోలీస్ ఆఫీసర్ చేపడతాడు. జాన్ కథాలి కూతురు పెర్లీ ఈ హత్యలకు పాల్పడిందని దేవ్ నారాయణన్ అనుమానిస్తాడు. ఈకేసు ఇన్వేస్టిగేషన్‌లో దేవ్‌నారాయణన్‌కు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అవేమిటి? తల్లిదండ్రుల హత్యకు పెర్లీకి ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
తెలుగులో మలుపు…
విరున్ను హీరోయిన్ నిక్కీ గల్రానీ తెలుగులో మలుపు మూవీలో నటించింది. ఈ సినిమా చిత్రీకరణలోనే హీరో ఆది పినిశెట్టితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లిచేసుకున్నారు. విరున్ను తర్వాత సినిమాలకు దూరమైంది.
హీరోగా…డైరెక్టర్‌గా…
అర్జున్ సర్జా దక్షిణాదిలో హీరోగా, డైరెక్టర్‌గా, సింగర్‌గా…బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్నాడు. తెలుగులో మావూరి మారాజు, హనుమాన్ జంక్షన్‌తో పాటు పలు సూపర్‌హిట్ సినిమాల్లో హీరోగా నటించాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. ప్రస్తుతం సీతాపయనం పేరుతో స్వీయ దర్శకత్వంలో ఓ మూవీని నిర్మిస్తోన్నాడు అర్జున్. ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సంబంధిత కథనం