ఏప్రిల్​ 30 వరకు భారీ ఉష్ణోగ్రతలు- ఈ ప్రాంతాలకు ఐఎండీ హీట్​వేవ్​ అలర్ట్​!

Best Web Hosting Provider In India 2024


ఏప్రిల్​ 30 వరకు భారీ ఉష్ణోగ్రతలు- ఈ ప్రాంతాలకు ఐఎండీ హీట్​వేవ్​ అలర్ట్​!

Sharath Chitturi HT Telugu

దేశవ్యాప్తంగా హీట్​వేవ్​ అలర్ట్​ని జారీ చేసింది ఐఎండీ. పలు ప్రాంతాల్లో ఈ నెల 30 వరకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

దిల్లీలో ఎండలకు పరిస్థితి ఇలా.. (HT_PRINT)

దేశంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో హీట్​వేవ్​ గురించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక అప్డేట్​ ఇచ్చింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్​ 30 వరకు హీట్​వేవ్​ పరిస్థితులు కొనసాగుతాయని ప్రజలను హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ప్రాంతాలకు హీట్​వేవ్​ అలర్ట్​..

మధ్యప్రదేశ్: పశ్చిమ మధ్యప్రదేశ్​లో ఏప్రిల్ 24 నుంచి 30 వరకు, తూర్పు మధ్యప్రదేశ్​లో ఏప్రిల్ 24, 27 తేదీల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

రాజస్థాన్: ఏప్రిల్ 25, 30 తేదీల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఉత్తర్​ప్రదేశ్, విదర్భ, బిహార్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ్​ బెంగాల్: ఏప్రిల్ 26 వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

పంజాబ్, హరియాణా: ఏప్రిల్ 25-29 మధ్య వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఛత్తీస్​గఢ్, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా: ఏప్రిల్ 25 తేదీన వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఏప్రిల్ 25 తేదీన పశ్చిమ్​ బెంగాల్, ఒడిశాలో వెచ్చని రాత్రి వాతావరణం ఉండే అవకాశం ఉంది.

ఏప్రిల్ 26 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహే, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ 27-30 తేదీల్లో గుజరాత్​లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది.

దిల్లీలో ఇలా..

ఏప్రిల్​ 25, 26, 27 తేదీల్లో దిల్లీలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ 25న దిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఐఎండీ ఆరెంజ్, యెల్లో అలర్ట్..

ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ్​బెంగాల్​లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఝార్ఖండ్​లోని సిమ్డెగా, సరైకెలా-ఖర్స్​వాన్, తూర్పు, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలకు ఏప్రిల్ 26 వరకు వడగాల్పులు వీస్తాయని చెబుతూ ‘యెల్లో’ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.

కనీసం మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని రాంచీ వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ అభిషేక్ ఆనంద్ తెలిపారు. ఆ తర్వాత 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని, ఏప్రిల్ 27 నుంచి వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందన్నారు.

మరోవైపు ఒడిశాలోని సుందర్గఢ్, సంబల్పూర్, సోనేపూర్, బౌధ్, బోలంగీర్, బార్గఢ్ జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేశారు. కలహండి, నుపాడా, దేవ్ గఢ్, అంగుల్ జిల్లాలకు ‘యెల్లో’ అలర్ట్ జారీ చేశారు.

బాలాసోర్, భద్రక్, జాజ్​పూర్, కేంద్రపారా, కటక్, జగత్సింగ్పూర్, పూరీ, ఖుర్దా, నయాగఢ్, గంజాం, గజపతి, కియోంఝర్గఢ్, ధెంకనాల్ ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది.

మహారాష్ట్రలోని బ్రహ్మపురి (45.6), చంద్రాపూర్ (45.5) తర్వాత ఒడిశాలోని పారిశ్రామిక పట్టణం ఝార్సుగూడ దేశంలో మూడొవ అత్యంత వేడి ప్రదేశంగా ఉందని ఐఎండీ గురువారం తెలిపింది.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య బయటకు వెళ్లేటప్పుడు తడి గుడ్డ, టోపీ లేదా గొడుగును ఉపయోగించి హీట్​వేవ్​కి గురికాకుండా ఉండాలని, తలను కప్పుకోవాలని ఐఎండీ సూచించింది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link