ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
పట్టణంలోని 18 వ వార్డులో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
శివ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ పట్టణంలోని 18వ వార్డు లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 13 వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ,
అనంతరం స్థానిక 18 వ వార్డులో శివ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు , ఈ సందర్భంగా శివ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని దుశ్శాలువతో సత్కరించి -తీర్థప్రసాదాలు అందజేశారు ,
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు ..