ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.03-9-2022(శనివారం) ..
పేదల జీవన ప్రమాణాలు మార్చేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ..
చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
చందర్లపాడు గ్రామం లోని సచివాలయం-1 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు , గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని , ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్ ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరారు , గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి -పథకాల అమలుకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు , సంక్షేమ పథకాలతో పాటు పలు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు , రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు ,పార్టీ నాయకులు కందుల నాగేశ్వరరావు ,యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , జానకి రామయ్య , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ..