Best Web Hosting Provider In India 2024

అనకాపల్లి: వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో చదువుల విప్లవం, విద్యారంగంలో దేశంలోనే ఏపి కి 3వ స్థానం వచ్చిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఉత్తరాంధ్రలో 3వ విడత సామాజిక సాధికార బస్సు యాత్ర చోడవరం నియోజకవర్గంలో అశేష జనవాహిని మధ్య అపూర్వంగా సాగింది. వేలాది బైక్ లు, వందలాది కార్లతో ర్యాలీ నిర్వహించి వైయస్సార్ సీపీ ప్రజాప్రతినిధులకు అఖండ స్వాగతం లభించింది. చోడవరం నియోజకవర్గ పరిధిలోని రోలుగుంటలో జై జగన్ అంటూ హర్షధ్వానాలతో ముందుకు సాగింది. అనంతరం నియోజకవర్గ పరిదిలోని పలు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. వడ్డాది జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్, ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, ఎంపీలు నందిగం సురేశ్, భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ , ఉమాశంకర్ గణేశ్, అదీప్ రాజుతో పాటుగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణీ హాజరయ్యారు.
సంక్షేమం, అభివృద్ధి కోసం మరోసారి జగన్ సీఎం కావాల్సిన ఆవశ్యకత ఉంది – డిప్యూటీ సీఎం రాజన్నదొర
వడ్డాది జంక్షన్ లో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మాట్లాడుతూ, అబివృద్ధి, సంక్షేమం కోసం మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. మళ్లీ జగన్ రావాలి.. సీఎం జగనే కావాలి అంటూ సభలో ఆయన నినదించారు. సమరానికి సైనికులై …అన్నలారా… అమ్మాలారా.. ముందుకు రండి. వైఎస్సార్ జెండాను ఎగురవేయండి… అంటూ రాజన్నదొర సభా వేదికపై పాటను ఆలపించి ఉత్సాహపరిచారు.
వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో చదువుల విప్లవం, విద్యారంగంలో దేశంలోనే 3వ స్థానం – మంత్రి కారుమూరి
పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా సంక్షేమ పథకాలను అందించాలని సీఎంగా జగన్ బాద్యతలు చేపట్టగానే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని, అదే బాబు సీఎం కాగానే జన్మభూమి కమిటీలు వేసి వారు చెప్పిన వారికే పథకాలు అందించాలని ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకునేలా చేసారని గుర్తు చేసారు. విద్యా రంగంలో జగన్ తీసుకువచ్చిన మార్పుల ద్వారా రాష్ట్రం దేశంలో 3 వ స్థానంలో నిలిచిందని, బాబు పాలనలో 15వ స్థానంలో మాత్రమే ఉండేదని వివరించారు. భారతదేశం నలుమూలలు తిరిగి రాష్ట్రం వైపు చూసేలా చదువుల విప్లవాన్ని తీసుకువచ్చారన్నారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు పథకమే, బాబు, పవన్ తెలంగాణ బర్రెలక్కను చూసి బుద్ధి తెచ్చుకోవాలి – ఎంపీ నందిగం సురేశ్
ఎంపీ నందిగo సురేశ్ మాట్లాడుతూ, 40 ఏళ్లకు పైబడి రాజకీయానుభవం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానపరచగా, జగన్ అధికారం చేపట్టిన తర్వాత బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక సాధికారతను సాధించి చూపారని కొనియాడారు. రాష్ట్రంలో పేదరికం తగ్గిందంటే కారణం జగన్ తాను చేసిన పాదయాత్రలో ప్రజా సమస్యల పట్ల ఆవేదనతో తీసుకున్న చర్యలేనని గుర్తు చేసారు. చంద్రబాబుకు తాత్కాలికంగా బెయిల్ వచ్చింది కానీ, చేసిన తప్పులకు ఏదోనాడు శిక్ష లు తప్పవని న్యాయస్థానాలు పేర్కొంటున్నాయని వివరించారు. బాబు, లోకేశ్ సైకోలు కాబట్టే వారిని ఎన్నికల్లో ఓడించారని, పవన్ తన రాజకీయ పార్టీని పెట్టి చంద్రబాబుకు అద్దెకి ఇస్తున్నాడని మండిపడ్డారు. జగన్ సింగిల్ గా వస్తూ సవాల్ చేస్తున్నా సరే పొత్తులు లేకుండా రావడానికి బాబు, పవన్ లకు దమ్ము లేదని ఎద్దేవా చేసారు. బషీర్ బాగ్ లో రైతులు విద్యుత్ చార్జీలపై ఆందోళన చేస్తే కాల్పులు చేయించిన చంద్రబాబు, ఇప్పుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతు సంక్షేమం అంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం వెన్నుపోటు పథకమేనని, ఎన్టీఆర్ చావుకు కారణమై,పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్ లు కూడా దక్కలేదని, బర్రెలక్కకు ఆరు వేలు ఓట్లు వచ్చాయన్నారు. పోటీ చేయని చంద్రబాబు, పోటీ చేసినా డిపాజిట్ రాని పవన్ కలసి బర్రెలక్క ను చూసి బుద్ది తెచ్చుకో వాలని హితవు పలికారు. మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎలా అవసరమో, రాష్ట్ర అబివృద్ధికి జగన్ కూడా రాష్ట్రానికి అలానే అవసరమని నందిగంసురేశ్ వ్యాఖ్యానించారు.
బాబు పాలనలో వ్యవసాయంలో మైనస్ గ్రోత్ , జగన్ ఏలుబడిలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ – మంత్రి ధర్మాన ప్రసాదరావు
రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో, నాలుగున్నరేళ్ల కాలంలో సీఎం జగన్ పాలనలో ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బాబు హయాంలో వ్యవసాయ రంగం మైనస్ గ్రోత్ లో పడిపోగా, ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 5.56 శాతంతో వ్యవసాయ రంగం పురోగమించిందని కేంద్ర ప్రభుత్వం వివరించ్చిందన్నారు. బాబు హయాంలో వ్యవసాయ రంగం 16వ స్థానంలో ఉంటే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం 4వ ర్యాంక్ ను జాతీయ స్థాయిలో కైవశం చేసుకుందని వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, గిట్టు బాటు ధర కల్పన, విత్తనాలు అందుబాటులో ఉంచడం, రైతు భరోసా జమ వంటి చర్యలతో వ్యవసాయ రంగాన్ని జగన్ పురోగతిలోకి తీసుకువచ్చారన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా తన పాలనలో నిర్వీర్యం చేసిన చంద్రబాబు ఇటీవల తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చుతున్నారని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేని పాలనా వ్యవస్థను తీసుకువచ్చినది జగన్ కాకుంటే మరోకరికీ సాధ్యం కాలేదన్నారు. జగన్ పాలనలో పేదలంతా ఆత్మగౌరవంతో సంక్షేమ పథకాల లబ్ధిని పొందుతున్నారని గుర్తు చేసారు. ఎన్నికలు వస్తే చాలు పసుపు కుంకుమ లాంటివి చంద్రబాబుకు గుర్తుకు వస్తుంటాయని, కానీ జగన్ మాత్రం పాలనా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే మహిళా సాధికారతకు చర్యలు చేపట్టారన్నారు. కోట్లాది కుటుంబాల జీవితాలను తీర్చిదిద్దుతూ, సంక్షేమం అందిస్తూ జీవన ప్రమాణాలు పెరిగేలా జగన్ పాలన సాగిస్తుంటే, చంద్రబాబు కుమారుడు లోకేశ్ సైకో పాలన అంటున్నాడని, సైకోలు ఇంతటి జనరంజక పాలన చేస్తారా అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి, చంద్రబాబు సీఎంగా 14ఏళ్లలో కూడా చేయలేకపోయారని విమర్శించారు.
అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో చోడవరంలో వార్ వన్ సైడ్ అని సామాజిక సాధికార బస్సు యాత్రకు హాజరైన జనసందోహాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. నాడు – నేడు ద్వారా విద్యార్థులకు, జగనన్న సురక్ష ద్వారా ఆరోగ్యం, మెడికల్ కాలేజీల ఏర్పాటుతో వైద్య విద్య వంటి రంగాల్లో సరికొత్త నిర్ణయాలు తీసుకుని జగన్ మార్పు తీసుకువచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ పిలుపు మేరకు 175 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరోసారి జగన్ ఎన్నిక కాావాల్సిన ఆవసరాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, ఆదర్శవంతమైన శక్తిగా ఆవిర్బవించి, రాష్ట్రాన్ని జనరంజకంగా సీెఎం జగన్ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ను మించిన నాయకుడు దేశంలోనే లేడని, సచివాలయాలు, వాలంటీరు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన మొనగాడు జగన్ అని పేర్కొన్నారు. చెరకు రైతులకు చంద్రబాబు సున్నం రాస్తే , జగన్ రూ. 80 కోట్లను కేటాయించి రైతాంగ సమస్యను పరిష్కరించారని గుర్తు చేసారు. రూ. 32 కోట్లతో నియోజకవర్గంలో పలు కీలక ప్రాంతాలకు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణం చేసారని వివరించారు. ఎప్పటి నుంచో పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో ఉన్న వడ్డాది నుంచి గన్నవరం వరకు రోడ్డును నిర్మాణం చేస్తున్నామని, సకాలంలో వేయకపోతే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. నాడు – నేడు ద్వారా 89 కోట్ల రూపాయలతో పాఠశాలల్లో అబివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. రూ. 1900 కోట్ల చోడవరం నియోజకవర్గానికి మంజూరు చేసి నాలుగున్నరేళ్లలో వైయస్ జగన్ విప్లవాత్మక అభివృద్ధిని తీసుకువచ్చారన్నారు.