ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.04-9-2022(ఆదివారం) ..
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రారంభించారు ,
ఈ సందర్భంగా పలు యువకులు , పార్టీ నాయకులు -కార్యకర్తలు రక్తదానం చేశారు , రక్తదానం చేయడం అభినందనీయమని – ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు , పట్టణ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి , కోర్ కమిటీ చైర్మన్ మహమ్మద్ మస్తాన్ , పార్టీ నాయకులు మండవ పిచ్చయ్య , చిరుమామిళ్ల చిన్ని ,రాయల జానకి రామయ్య , కౌన్సిలర్ యాకూబ్ అలి , దుబాయ్ కరిముల్లా , పాములపాటి రమేష్ , ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు ..