హైదరాబాద్ :
రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతికి సంతాపం తెలిపిన ఏపీ ప్రభుత్వం ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ చేరుకుని కృష్ణంరాజు గారి అంత్యక్రియలలో పాల్గొని ఆయన పార్ధివదేహానికి ఘననివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి బృందం ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించిన కృష్ణంరాజు గారి సేవలు మరువలేనివని తెలిపిన ఏపీ మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ..
ఏపీ ప్రభుత్వం తరఫున సంతాపం తెలిపిన మంత్రుల బృందానికి ధన్యవాదాలు తెలిపిన హీరో ప్రభాస్ ..
మంత్రుల బృందంలో ఏపీ సినిమాటోగ్రాఫీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ,మంత్రి విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..