Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: చంద్రబాబులా కాళ్లూ చేతులూ అడ్డుపెట్టి తుపానును మళ్లించలేమని రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్, వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పల్లెలకు, రైతులకు పూర్తి వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. ఆయన నేలమీద నడవడు. ఆయనదంతా హైటెక్ సిద్ధాంతమని అభివర్ణించారు. నాలుగేళ్లుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పట్టిసీమతో పనేంటి అని ప్రశ్నించారు. గేట్లు కొట్టుకుపోవడం మీ నిర్వాకం వల్ల కాదా చంద్రబాబూ? అని నాగిరెడ్డి నిలదీశారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా రైతులు నమ్మరని పేర్కొన్నారు. ప్రజలకు పనిచేసిన ప్రభుత్వం..ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మీడియా మాట్లాడారు.