Best Web Hosting Provider In India 2024
16 Dec 2023 11:00 AM
చిత్తూరు జిల్లా: ప్రజల ఆదరాభిమానాలతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. శనివారం చిత్తూరు జిల్లా పలమనేరులో సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టనున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ పాలనలో బడుగులకు జరిగిన మేలుకు గుర్తుగా ఈ కార్యక్రమాన్ని ఓ విజయయాత్రలా, ఘనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే వెంకటేశ్‌గౌడు అన్నారు. రాష్ట్రంలోనే పలమనేరు సాధికార సభ ప్రభంజనంలా ఉండాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని, దీనిని నియోజకవర్గ ప్రజలు దిగ్విజయం చేయాలని ఎమ్మెల్యే కోరారు.