Best Web Hosting Provider In India 2024
Naa Saami Ranga Allari Naresh Intro First Look Glimpse: కింగ్ నాగార్జున రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్‌తో కూడిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’తో రాబోతున్నారు. ఈ సినిమాతో నూతన దర్శకుడిగా విజయ్ బిన్నీ పరిచయం కానున్నారు. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కిన నా సామిరంగ సినిమాలో ఫ్రెండ్ షిప్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. సినిమాలోని ఆ లేయర్ ని ఒక గ్లింప్స్ ద్వారా రివిల్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
‘అంజి’ పాత్రను
నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అల్లరి నరేష్ చేస్తున్న‘అంజి’ పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఇది కేవలం పాత్రను పరిచయం చేయడానికే కాదు, అల్లరి నరేష్‌తో నాగార్జునకు ఉన్న రిలేషన్ ని చాలా అద్భుతంగా చూపించింది. గ్లింప్స్ ని చూస్తే నరేష్, నాగార్జునతో స్నేహపూర్వక సంబంధాన్ని పంచుకునే సరదా వ్యక్తిగా కనిపించారు.
మాటమీద నిలబడే వ్యక్తి
మాటొచ్చేత్తది అనేది అల్లరి నరేష్ తరుచుగా వాడే మాటేగా గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. ఇది మాటమీద నిలబడే వ్యక్తిగా అతని పాత్రను సూచిస్తుంది. అంతేకాకుండా నాగార్జునకు అల్లరి నరేష్ ముద్దు పెట్టే సీన్‌తో వాళ్ల బాండింగ్ ఎలా ఉంటుందో చూపించారు. నాగార్జున, అల్లరి నరేష్‌లను కలిసి చూడటం కనుల పండువగా ఉంటుంది. అల్లరి నరేష్ సినిమాకు పెద్ద వాల్యూ అడిషన్ అని మేకర్స్ తెలిపారు.
త్వరలో టీజర్
శివేంద్ర దాశరధి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపించగా, ఎంఎం కీరవాణి తన ఆకర్షణీయమైన సంగీతంతో విజువల్స్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చారు. గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టీజర్‌ను త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కాగా ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే హీరోయిన్ అంజలి కూడా ఓ పాత్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
2024లో సంక్రాంతికి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నా సామిరంగ చిత్రాన్ని హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. చంద్రబోస్ లిరిక్స్ అందిస్తుండగా, బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. ‘నా సామిరంగ’ చిత్రాన్ని 2024లో సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు.