అంబారుపేట గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

monditoka jagan mohan rao monditoka arun kumar ysrcp nandigama monditoka jagan mohan rao monditoka arun kumar
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.13-9-2022(మంగళవారం) ..

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సంక్షేమ పథకాలు ..

అంబారుపేట గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ మండలంలోని అంబారుపేట గ్రామంలో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనారిటీల జీవితాలలో వెలుగులు తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని , ఎస్టి ఎస్సీ బీసీలను రాజ్యాధికారంలో భాగం చేస్తూ మంత్రివర్గ విస్తరణలో కూడా వారికి పెద్దపీట వేశారని , వారికి మంత్రులుగా అవకాశం కల్పించడమే కాకుండా -ఉపముఖ్యమంత్రులుగా కూడా అవకాశం కల్పించిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు , నామినేటెడ్ పదవుల్లో సైతం బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తున్నారని , సంక్షేమ పథకాలతో పేద మహిళల జీవితాల్లో భరోసా ఏర్పడిందని – మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారని ,గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లిన మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్దతుగా మాట్లాడడమే కాకుండా ,మళ్లీ ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని ,మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అండగా ఉంటామని తెలిపారని చెప్పారు ,

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐలపోగు రమాదేవి , ఐతవరం సర్పంచ్ ఉదయలక్ష్మి నాయుడు , జడ్పిటిసి గాదెల బాబు, ఎంపీపీ సుందరమ్మ, వైస్ ఎంపీపీ అన్నం పిచ్చయ్య , మండల కన్వీనర్ శివ నాగేశ్వరరావు ,పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు ,తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *