Best Web Hosting Provider In India 2024
PDF MLC Killed: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. ఉండి మండలం చెరుకువాడ వద్ద 2 కార్లు ఢీకొని సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. భీమవరంలో జరిగిన అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ట్రెండింగ్ వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకు వాడ వద్ద ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. భీమవరం నుంచి తిరుగు ప్రయాణమైన చెరుకువాడ వద్ద వాహనాన్ని నిలిపి ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్సీ షాక్కు గురై మరణించినట్టు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న వాహనం బలంగా ఢీకొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని ఆయనతో ఉన్న వారు తెలిపారు.
ప్రమాదంలో వాహనంలో ఉన్న మరికొందరికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ భీమవరం హాస్పిటల్ కు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు