Vizag AutoDriver: విశాఖ ఆటో డ్రైవర్ నిజాయితీ.. ప్రయాణికురాలి నగదు, నగలు అప్పగింత

Best Web Hosting Provider In India 2024

Vizag AutoDriver: విశాఖపట్నంలో ఓ మహిళ పోగొట్టుకున్న విలువైన ఆభరణాల బ్యాగును గంటల వ్యవధిలోనే పోలీసులు అందించారు. బుధవారం సాయంత్రం సుమారు 4.30 గంటలకు కే.భారతి అనే మహిళ భీమిలి నగరంపాలెం నుంచి ఎం.వీ.పీ సర్కిల్ వరకు ఆటోలో ప్రయాణించింది.

 

ట్రెండింగ్ వార్తలు

ఎంవిపి సర్కిల్‌లో ఆటో దిగే సమయంలో తనతో పాటు తెచ్చిన బ్యాగును తీసుకోవడం మర్చిపోయింది. కాసేపటి తర్వాత బ్యాగును ఆటోలో మర్చిపోయినట్లు గుర్తించి చుట్టుప్రక్కల ఆటో కోసం వెతుకగా కనపడకపోవడంతో ఎం.వీ.పీ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఆటోలో వదిలేసిన బ్యాగులో 5 తులాల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి వస్తువులు, 18,000 నగదు ఉన్నాయని తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాలు ఆధారంగా కానిస్టేబుల్‌ హరి.. అప్పుఘర్ ఆటో స్టాండ్‌లో ఉండే దూడ సత్యనారాయణ అనే ఒక ఆటో డ్రైవర్ సహాయంతో బాధితురాలు ప్రయాణించిన ఆటోను కనిపెట్టారు. అప్పటికే ఆటో డ్రైవర్ ఆర్.కొండలరావు అలియాస్‌ రాజు ఆటోలో బ్యాగును గుర్తించి పోలీసులకు అప్పగించేందుకు వస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు.

గురువారం అడిషనల్ డీజీపీ, విశాఖ కమీషనర్ రవి శంకర్‌ అయ్యన్నార్ చేతుల మీదుగా బాధితురాలికు నగల బ్యాగును అందజేశారు. నగల సంచి కనిపెట్టడంలో ప్రతిభ కనబర్చిన ఎంవీపీ కానిస్టేబుల్ హరికి మెరిట్ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు. బ్యాగును కనిపెట్టడంలో సహాయం చేసిన సత్యనారాయణ, స్వచ్ఛందంగా బ్యాగును అప్పగించిన రాజులను అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు.

 
WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *