Best Web Hosting Provider In India 2024
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నేడు భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో కేబినెట్ భేటీ జరుగనుంది. 2024 జనవరి ఒకటవ తేదీ నుంచి రూ. 3 వేల పెన్షన్ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
ట్రెండింగ్ వార్తలు
మిగ్ జామ్ తుఫాన్ పంట నష్టాన్ని అంచనా వేయడంతో పాటు పరిహారంపై కేబినెట్ చర్చించనుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పరిమితిని రూ.25 లక్షల పెంపునకు ఏపీ మంత్రిమండలి అమోదం తెలుపనుంది.
పలు సంస్థలకు భూకేటాయింపులకు కేబినెట్ అమోదముద్ర వేయనుంది.ఏపీలో గ్రూప్- 1 అండ్ 2 ఉద్యోగ నియామకాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు.. ఎమ్మెల్యేలు,మంత్రుల సీట్ల మార్పుపై కేబినెట్ తర్వాత సహచరులతో సీఎం చర్చించే అవకాశాలున్నాయి.
కోస్తా జిల్లాల్లో ఇటీవల జరిగిన పంటనష్టం, మిగ్ జామ్ తుఫాను ప్రభావం, రాయలసీమ జిల్లాల్లో కరువు ప్రభావంపై మంత్రి వర్గంతో సిఎం చర్చిస్తారు. 2019 ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్లను రూ.3వేలకు పెంచుతామని వైసీపీ ప్రకటించింది. 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా రూ.250 రుపాయల చొప్పున పెన్షన్లను ఏటా పెంచుతోంది. 2024 జనవరి 1 నుంచి రూ.3వేల చొప్పున పెన్షన్లు అందించనున్నారు.