Bigg Boss Grand Finale: బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే ప్రారంభం.. ఒక్కరోజే ముగ్గురు ఎలిమినేట్

Best Web Hosting Provider In India 2024

Bigg Boss 7 Telugu Winner Voting: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ పూర్తి కావడానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. ఆదివారం అంటే డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ గ్రాండ్ ఫినాలేలో టైటిల్ విజేతను ప్రకటించనున్నారు. అయితే, సెప్టెంబర్ 3న ప్రారంభమైన బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లోకి మొదటగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.

 

ట్రెండింగ్ వార్తలు

14 మంది కంటెస్టెంట్స్‌లో సీనియర్ హీరోయిన్ కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని భట్ల, ఆట సందీప్, టేస్టీ తేజ, శోభా శెట్టి, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, హీరో శివాజీ, అమర్ దీప్ చౌదరి, రతిక రోజ్, శుభ శ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ 7 తెలుగు 2.0 సీజన్ వచ్చేసరికి కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని భట్ల, రతిక రోజ్, శుభ శ్రీ వరుసగా ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు.

బిగ్ బాస్ 7 తెలుగు 2.0 సీజన్‌లో భాగంగా అర్జున్ అంబటి, పూజా మూర్తి, నయని పావని, సింగర్ భోలే షావలి, అశ్విని శ్రీ ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ముందుగా నయని పావని ఎలిమినేట్ కాగా.. రతిక రోజ్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక 15వ వారాలు వచ్చేసరికి అంతా ఎలిమినేట్ అయి హౌజ్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక, అర్జున్ ఫినాలే వీక్‌కు చేరుకుని టాప్ 6 కంటెస్టెంట్స్‌గా నిలిచారు.

డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. అందుకు డిసెంబర్ 16న అంటే శనివారం రోజు షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ షూటింగ్‌లో కంటెస్టెంట్స్ కుటుంబాలను ఇంట్రడక్షన్స్ ఇచ్చి కూర్చోబెడతారు. అనంతరం వరసుగా ముగ్గురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయనున్నారు.

 

గ్రాండ్ ఫినాలే మొదటగా అర్జున్ అంబటి లేదా ప్రియాంక జైన్ ఎలిమినేట్ కానున్నారు. ఎందుకంటే వీరిద్దరికి సరి సమానంగా.. స్వల్ప తేడాతో ఓటింగ్ నమోదు అయింది. ఈ ఇద్దరి ఎలిమినేషన్ తర్వాత టాప్ 4లో ఉన్న ప్రిన్స్ యావర్‌ను ఎలిమినేట్ అవుతాడు. అనంతరం టాప్ 3లో పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ నిలుస్తారు. వీరు ఏ స్థానాల్లో ఉంటారో ఇంకా స్పష్టత రాలేదు.

ఎందుకంటే పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ ముగ్గురుకి పోటాపోటీగా ఓటింగ్ నమోదు అవుతోంది. ఇక టైటిల్ విజేతను డిసెంబర్ 17 ఆదివారం రోజునే షూటింగ్ చేసి ప్రకటిస్తారు. సాయంత్ర ఆరు గంటలకు గ్రాండ్ ఫినాలే ప్రారంభం కాగా రాత్రి 8 గంటలకు షూటింగ్ పూర్తి అవుతుంది. అప్పుడే టైటిల్ విజేత ఎవరనేది లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇక అధికారికంగా మాత్రం రాత్రి 10 లేదా 11 గంటలకు బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరనేది తెలుస్తుంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *