ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.13-9-2022(మంగళవారం) ..
చందర్లపాడు గ్రామంలో సచివాలయం -1 మరియు 3 పరిధిలలో వాలంటీర్లు -సచివాలయ సిబ్బంది- అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
“గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలపై – పరిష్కారాల పై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
చందర్లపాడు గ్రామం లోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో గ్రామ పంచాయతీ అధికారులు మరియు వాలంటీర్లు -సచివాలయ సిబ్బందితో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం చేపట్టిన “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం చందర్లపాడు గ్రామంలోని “సచివాలయం-1 మరియు 3” పరిధిలో పూర్తయిందని – ఆ సచివాలయాల పరిధిలో ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం తరఫున అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని , అదేవిధంగా ఆ సచివాలయ పరిధిలో డ్రైనేజీ సమస్య -రోడ్డు సమస్య – వాటర్ లైన్ సమస్య – మరియు అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం నుండి ఒక్కో సచివాలయానికి విడుదల కానున్న రూ.20 లక్షలతో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి – వాటి అంచనా విలువ తదితర అంశాలపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు , ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏదైనా సాంకేతిక సమస్య కారణంగా అందటం లేదని గడపగడప కు- మన ప్రభుత్వం కార్యక్రమంలో నమోదు చేసుకున్న అర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు కస్తాల పున్నమ్మ, బొబ్బెళ్ళపాడు మోహన్ రెడ్డి ,జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు, యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ ,కందుల నాగేశ్వరరావు, రాయల జానకిరామయ్య ,సత్యనారాయణ, మౌలాలి, సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..