Best Web Hosting Provider In India 2024
JioTV Premium Plans: ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన కొత్త జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త ప్లాన్స్ ప్రకారం ఏకంగా 14 ఓటీటీలను ఒకే ప్లాన్ తో పొందే అవకాశం కల్పించింది. దీంతోపాటు మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అనౌన్స్ చేయడం విశేషం. నెలవారీ, మూడు నెలలు, వార్షిక ప్లాన్స్ రూ.398 నుంచి ప్రారంభం కానున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఈ జియో కొత్త ప్లాన్స్ తో కాల్స్, ఎస్ఎంఎస్ లతోపాటు ప్రముఖ ఓటీటీలు ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటివి జియోటీవీ యాప్ ద్వారా పొందే వీలుంటుంది. శుక్రవారం (డిసెంబర్ 15) నుంచి ఈ కొత్త ప్లాన్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు ప్లాన్స్ కూడా రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తాయి.
జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే..
జియో కొత్తగా రూ.398, రూ.1198, రూ.4498 ప్లాన్స్ తీసుకొచ్చింది. వీటి కింద 28, 84, 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఈ మూడు ప్లాన్స్ తోనూ 14 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు యాక్సెస్ లభిస్తుంది. జియో సినిమా ప్రీమియం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో (మొబైల్), లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, డాక్యుబే, సన్ఎన్ఎక్స్‌టీ, హొయ్‌చొయ్, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఎపిక్ఆన్, కంచా లంకాలాంటి ఓటీటీల యాక్సెస్ లభిస్తుంది.
ఓటీటీలకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్న ఈ కాలంలో అన్ని టెలికాం కంపెనీలు ప్రత్యేక ప్లాన్స్ తో ఉచితంగా వివిధ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లను యూజర్లకు అందిస్తున్నాయి. జియో యూజర్లకు ఇప్పటికే జియో టీవీ, జియో సినిమాలాంటి ఆ సంస్థకు చెందిన యాప్స్ ఫ్రీయాక్సెస్ ఉండగా.. తాజా ప్లాన్స్ ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు కూడా అందిస్తోంది.