Best Web Hosting Provider In India 2024
Bread Puri Recipe: బ్రెడ్‌తో టేస్టీగా బ్రెడ్ పూరీలను తయారు చేసుకోవచ్చు. మైదా, గోధుమపిండితో చేసిన పూరీలు బోర్ కొడితే ఒకసారి ఈ బ్రెడ్ పూరీలను ట్రై చేయండి. వీటి రుచి అదిరిపోతుంది. ఆలూ మసాలా కర్రీతో పాటు ఇవి తింటే టేస్టీగా ఉంటాయి. వీటిని చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ పూరి ఎలా తయారు చేయాలో చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
బ్రెడ్ పూరి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బ్రెడ్ స్లైసులు – మూడు
గోధుమపిండి – ఒక కప్పు
బొంబాయి రవ్వ – ఒక స్పూను
పెరుగు – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – ఫ్రై చేయడానికి సరిపడా
బ్రెడ్ పూరి రెసిపీ ఇలా
1. బ్రెడ్ స్లైసులను మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ బ్రెడ్ పొడిని ఒక గిన్నెలో వేసుకోవాలి.
2. ఆ గిన్నెలోనే గోధుమపిండి, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, నీళ్లు కలిపి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
3. పది నిమిషాలు మూత పెట్టి పక్కకు వదిలేయాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి.
4. స్టవ్ పై కళాయి పెట్టి పూరీలు వేయించడానికి సరిపడా నూనెను పోయాలి.
5. నూనె బాగా వేడెక్కాక ఈ బ్రెడ్ పూరీలను రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి.
6. ఈ బ్రెడ్ పూరీలను ఆలూ మసాలా కర్రీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి క్రిస్పీగా కూడా వస్తాయి.
7. నిత్యం చేసే గోధుమ పూరీల్లాగే కనిపిస్తున్నా దీనికి బ్రెడ్డు జత చేరడం వల్ల రుచి భిన్నంగా ఉంటుంది.
8. పిల్లలకు ఈ బ్రెడ్ పూరి నచ్చుతుంది. వాటిని ఇష్టంగా తింటారు.
9. ఈ బ్రెడ్ పూరితో చికెన్ కర్రీ, ఎగ్ కీమా వంటివి తింటే రుచి అదిరిపోతుంది.