Best Web Hosting Provider In India 2024
Actor Sameer On Sivaji Daughter: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో మైండ్ గేమ్‌తో ఆడి బాగా పాపులర్ అయ్యారు హీరో శివాజీ. ఆయనకు ఇప్పటివరకు ఇద్దరు కొడుకులు మాత్రమే అని తెలుసు. హౌజ్‌లో కూడా అదే చెప్పారు. బిగ్ బాస్ హౌజ్‌లోకి డాక్టర్‌గా శివాజీ పెద్ద కొడుకు వస్తే.. స్టేజీపైకి భార్యతోపాటు చిన్న కొడుకు కూడా వచ్చాడు. కానీ, శివాజీ కూతురు ప్రస్తావన మాత్రం ఎక్కడా రాలేదు.
ట్రెండింగ్ వార్తలు
ఇద్దరికీ సపోర్ట్
అయితే, బిగ్ బాస్ హౌజ్‌లో శోభా శెట్టితో గొడవ జరిగాకా ఇంట్లో ఇలాంటి వాళ్లు ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాన్ని అని శివాజీ అన్న మాటలు పెద్ద రచ్చ చేశాయి. దీనిపై నాగార్జున కూడా శివాజీపై ఫైర్ అయ్యారు. నాగార్జున, శివాజీ వాగ్వాదంపై ట్రోలింగ్ కూడా జరిగింది. ఇందులో కొంతమంది శివాజీని సపోర్ట్ చేస్తే.. మరికొందరు నాగ్‌ను వెనుకేసుకొచ్చారు.
ఒక కుమార్తె కూడా
ఈ నేపథ్యంలో శివాజీకి ఇద్దరు కొడుకులతోపాటు ఒక కూతురు కూడా ఉందని నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సమీర్ షాకింగ్ విషయం చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో “నాగార్జునతో జరిగిన చర్చలో శివాజీ కచ్చితంగా కరెక్ట్. మా ఇంట్లో ఇలాంటి ఆడపిల్ల ఉంటే పీకమీద కాలేసి తొక్కుతా అన్నారు. శివాజీకి కూడా ఒక కూతురు ఉంది. ఇద్దరు కొడుకులు కాకుండా కుమార్తె కూడా ఉంది” అని ఎవరికీ తెలియని విషయం చెప్పుకొచ్చాడు నటుడు సమీర్.
అలా అనాల్సింది కాదు
“శివాజీ నిజంగానే పీకమీద కాలేసి తొక్కేవాడైతే ఇంట్లో వాళ్లపై అలా చేసేవాడు కదా. పీక మీద కాలేసి తొక్కేయడం అంటే.. నిజంగానే తొక్కేస్తా అని కాదు. మందలిస్తాని, లేదా కోప్పడతానని అన్నాడు. శోభా శెట్టి ప్రవర్తన పరాకాష్టకి చేరినప్పుడు ఆయన కంట్రోల్ తప్పి అన్న మాటే తప్పితే నిజంగా తొక్కేస్తాడని కాదు. ఆయన కోపం ఏ స్థాయిలోకి వెళితే అలాంటి మాట అంటాడు. ఇంత పెద్ద టెలివిజన్ షోలో శివాజీ ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది” అని సమీర్ తెలిపాడు.
నాగార్జున తప్పేం లేదు
“శివాజీ కూడా వివరణ ఇచ్చారు. అది నాకు జెన్యూన్‌గా అనిపించింది. మన సైడ్ తప్పు లేనప్పుడు మాట్లాడటంలో తప్పులేదు. ఆడపిల్లల్ని పట్టుకుని అలా అనొచ్చా అని ఆడియెన్స్ నుంచి ఒకామె అడిగితే.. మగ పిల్లల్ని అయితే తొక్కేయొచ్చమ్మా అని శివాజీ అడిగారు. అది కరెక్టే కదా. దానికి కూడా శివాజీ డైవర్ట్ చేస్తున్నాడని నాగార్జున కోప్పడ్డారు. ఇందులో నాగార్జునని తప్పుబట్టడానికి కూడా లేదు. అది ఆయన అభిప్రాయం కాదు. ఆయన బిగ్ బాస్ హోస్ట్ కాబట్టి ఆ టీమ్ చెప్పినట్లు చేయాలి” అని సమీర్ అన్నాడు.