Best Web Hosting Provider In India 2024
Pindam Movie Review: శ్రీరామ్, ఖుషిరవి, ఈశ్వరీరావు ప్రధాన పాత్రల్లో నటించిన పిండం మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్కెరీయెస్ట్ ఫిల్మ్ ఎవర్ అంటూ చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్‌తో ఈ చిన్న సినిమాపై తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. పిండం నిజంగానే భయపెట్టిందా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే.
ట్రెండింగ్ వార్తలు
ఆంథోనీ ఫ్యామిలీ కథ…
ఆంథోనీ (శ్రీరామ్) రైస్‌మిల్లులో అకౌంటెంట్‌గా పనిచేస్తుంటాడు. సుక్లాపేట్‌లోని ఓ పాత కాలం నాటి ఇంటిని కొన్న ఆంథోనీ తన భార్య మేరి (ఖుషిరవి), తల్లి సూరమ్మతో పాటు ఇద్దరు పిల్లలు సోఫీ, తారలతో కలిసి ఆ ఇంటిలో దిగుతాడు. ఆ పాత ఇంటిలోకి వచ్చినప్పటి నుంచి ఆంథోనీ జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతోంటాయి.
ఆ ఇంటిలో ఉన్న ఆత్మల కారణంగా ఆంథోనీ భార్య మేరితో పాటు తల్లి సూరమ్మ ప్రమాదానికి లోనవుతారు. ఆత్మలు కారణంగా ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లలేకపోతాడు ఆంథోనీ. ఆ తర్వాత ఏమైంది? ఆత్మల బారి నుంచి ఆంథోనీ ఫ్యామిలీని అన్నమ్మ (ఈశ్వరీరావ్) కాపాడిందా? ఆ ఆత్మలు ఆంథోనీ ఫ్యామిలీని ఎందుకు ఆవహించాయి? ఆ ఆత్మల గతం ఏమిటి? ఆంథోనీ కథతో క్షుద్ర శక్తులపై పరిశోధన చేస్తోన్న లోక్‌నాథ్‌కు (శ్రీనివాస్ అవసరాల) ఉన్న సంబంధం ఏమిటి అన్నదే పిండం మూవీ కథ.
ఎవర్‌గ్రీన్ ఫార్ములా…
పాడుబడిన పాత ఇంట్లోకి హీరో ఫ్యామిలీ రావడం, అందులో ఆత్మలు ఉండటం, వాటి నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం అన్నది హారర్ సినిమాల్లో ఎవర్‌గ్రీన్ ఫార్ములా. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ ఫార్ములాలో వందలాది సినిమాలొచ్చాయి.
అయినా జానర్‌కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ ఫార్ములా తో దర్శకులు కథలు రాస్తూనే ఉన్నారు. పిండం ఆ కోవకు చెందిన సినిమానే. కామెడీ, హీరోయిజం లాంటి అంశాలతో మిక్స్ చేయకుండా ప్యూర్ హారర్ మూవీగా పిండం సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కథ రొటీన్ అయినా సౌండ్స్, హారర్ ఎలిమెంట్స్‌తో భయపెట్టాడు.
డైరెక్ట్‌గా కథలోకి కాకుండా..
డైరెక్ట్‌గా ఆంథోనీ ఫ్యామిలీ స్టోరీని చూపించకుండా ఆత్మలు, క్షుద్ర శక్తులపై పరిశోధన చేసే లోక్‌నాథ్…అన్నమ్మను కలవడంతో ఈ సినిమాను మొదలుపెట్టారు డైరెక్టర్. లోక్‌నాథ్‌కు అన్నమ్మ చెప్పే ఫ్లాష్‌బ్యాక్ ద్వారా అసలు కథలోకి డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆత్మల కారణంగా ఆంథోనీ ఫ్యామిలీ భయపడే సీన్స్‌తో ఫస్ట్‌హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఆ సీన్స్‌తో మొత్తం సగటు హారర్ సినిమాల ఛాయలతోనే సాగుతాయి.
అన్నమ్మ ఎంట్రీ తర్వాతే కథ గాడిన పడ్డ భావన కలుగుతుంది. సెకండాఫ్‌లో ఆ ఇంట్లో ఉన్న గర్భిణితో పాటు ఆడపిల్లలు ఎలా చనిపోయారనే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్ కాస్త లాజిక్‌లకు దూరంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది.పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో కథను నడిపించడం కూడా సినిమాకు ప్లస్సయింది.
శ్రీరామ్ పాత్ర హైలైట్…
తన అనుభవంతో ఆంథోనీ పాత్రలో శ్రీరామ్ ఒదిగిపోయాడు. ఆత్మల బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగా అతడి నటన మెప్పిస్తుంది. తాంత్రిక విద్యలు తెలిసిన మహిళగా ఈశ్వరీరావు చాలా వరకు ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నటించిన విధానం బాగుంది.ఆమె క్యారెక్టర్‌ను డైరెక్టర్ డిజైన్ చేసుకున్న తీరు మెప్పిస్తుంది. ఖుషి రవి నటన ఆకట్టుకుంటుంది.శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ నిడివి తక్కువే.
ప్యూర్ హారర్ మూవీ…
పిండం హారర్ సినిమా లవర్స్‌ను మెప్పిస్తుంది. ప్యూర్ సినిమా చూసిన ఫీలింగ్‌ను కలిగిస్తుంది.