Best Web Hosting Provider In India 2024
Saturday Motivation: ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు, ఆశయాలు. ఆ ఆశలు నెరవేరకపోయినా, ఆశయానికీ, మీకూ మధ్య దూరం పెరిగినా మానసికంగా కుంగిపోతారు ఎంతో మంది. ప్రేమ విఫలమైందని, తక్కువ మార్కులు వచ్చాయని, కాలేజీలో సీటు రాలేదని, పెళ్లి కావడం లేదని… ఒక్కొక్కరికి ఒక్కో కారణం. ఎవరి సమస్య వారికి పెద్దది. మనం పెద్దగా చూస్తే చీమ కూడా ఏనుగంత పెద్దదిగా కనిపిస్తుంది. సమస్యను మనం చూసే కోణంలోనే ఉంది.
ట్రెండింగ్ వార్తలు
తక్కువ మార్కులు వచ్చినప్పుడు… మరోసారి రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకుందాం అనుకుంటే సరిపోతుంది. కానీ ఎంతో మంది క్షణికావేశంలో విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి కావడం లేదని బాధపడేకన్నా… పెళ్లికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ ప్రయత్నాలు ఎందుకు సఫలం కావడం లేదో ఆలోచిస్తే మంచిది. అమ్మాయి ప్రేమ విఫలం అయితే జీవితమే కోల్పోయినట్టు ప్రాణాలు తీసేసుకుంటారు. నిజానికి అమ్మానాన్నల ప్రేమ కన్నా అమ్మాయి ప్రేమ గొప్పదా అనుకుంటే సరిపోతుంది. లేదా అమ్మానాన్నలు చక్కటి అమ్మాయిని చూస్తారని తనకు తాను సర్ది చెప్పుకున్నా చాలు. తేలికగా తీసి పక్కన పెట్టే సమస్యలను కూడా భూతద్ధంలో పెట్టి చూసి… వాటిని తమ దారికి అడ్డొచ్చే కొండల్లా భావించుకోవడం వల్ల జీవితం అక్కడే ఆగిపోతుంది. మీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి ఓటమి… ఒక బ్రేక్ గా భావించాలి, దాన్నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఆ బ్రేక్ లో కాస్త విశ్రాంతి తీసుకుని మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో జీవితంలో సాగేందుకు ప్రయత్నించాలి.
మెదడుకు సమయం ఇవ్వండి
మీకు ఎదురైన ఓటమిని తట్టుకోలేక ఆ బాధను, కోపాన్ని మీమీద, మీ ఇంట్లో వాళ్ల మీద చూపించే కన్నా…కొన్ని నిమిషాలు శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కోపం చల్లారుతుంది. ఆవేశం తగ్గుతుంది. మెదడు మళ్లీ పనిచేయడం మొదలుపెడుతుంది. భవిష్యత్తు కోసం ఏం చేయాలో ఆలోచించడానికి మెదడుకు ఆ సమయాన్ని ఇవ్వండి. క్షణాల్లో విపరీత నిర్ణయాలు తీసుకోకండి.
ఓటమి ఎదురవగానే కంగారు పడితే వెంటనే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఆ సమయంలోనే ఆలోచనా శక్తి మన ఆధీనంలో ఉండదు. తట్టుకోలేని స్థాయిలో ప్రతిస్పందనలు కలుగుతున్నప్పుడు ఒంటరిగా ఉండకండి. కుటుంబసభ్యుల సహకారాన్ని తీసుకోండి. వారితో మీ బాధను పంచుకోండి. వీలైతే ఏడ్చేయండి. ఒత్తిడి హార్మోన్ల విడుదల తగ్గుతుంది. మీకు మానసికంగా భారం తగ్గినట్టు అనిపిస్తుంది. విపరీత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా తగ్గుతుంది. మిమ్మల్ని బలహీనుడిగా చూసుకుంటే మీరు మరింత బలహీన పడే అవకాశం ఉంది. సమస్యలు అవాంతరాలు కావు… అవి మీకు దారి చూపే మార్గదర్శకాలు అనుకోండి. ఏదైనా జీవితంలో సాధించాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. మీమీద మీకే నమ్మకం లేకపోతే ఎదుటివారికి ఆ నమ్మకం ఎక్కడ్నించి వస్తుంది.
ఐన్‌స్టీన్ ఓటమి
ఓటమితో కుంగిపోయారో… ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఐన్ స్టీన్ బల్బు కనిపెట్టే ప్రయత్నంలో 2,774 సార్లు విఫలమయ్యాడు. అయిన పట్టువిడవకుండా ప్రయత్నించాడు కాబట్టే… ఇప్పుడు మన ఇళ్లల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అతని వైఫల్యం ముందు మీ ఓటమి ఎంత? మీరే ఆలోచించండి.