ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.14-9-2022(బుధవారం) ..
పేదల జీవన ప్రమాణాలు మార్చేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ..
అంబారుపేట గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని అంబారుపేట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు , గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని , ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్ ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరారు , గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి -పథకాల అమలుకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు , సంక్షేమ పథకాలతో పాటు పలు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు , రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐలపోగు రమాదేవి రామయ్య, జడ్పీటీసీ గాదెల బాబు, ఎంపీపీ సుందరమ్మ , వైస్ ఎంపీపీ అన్నం పిచ్చయ్య , పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు ..